Google | ఢిల్లీ డేటా సెంటర్ లో అగ్నిప్రమాదం.. గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం..
Google | దేశ రాజధాని ఢిల్లీలోని ఓ థర్డ్‌పార్టీ డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో గూగుల్ క్లౌడ్ నెట్‌వర్క్ సేవలు అంతరాయానికి గురయ్యాయి. ఢిల్లీ, ముంబై, చెన్నైతోపాటు పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ లేటెన్సీ పెరగడం, పాకెట్ లాస్ సమస్యలు ఎదురవుతున్నట్లు గూగుల్ వెల్లడించింది.
Google | దేశ రాజధాని ఢిల్లీలోని ఓ థర్డ్‌పార్టీ డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో గూగుల్ క్లౌడ్ నెట్‌వర్క్ సేవలు అంతరాయానికి గురయ్యాయి. ఢిల్లీ, ముంబై, చెన్నైతోపాటు పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ లేటెన్సీ పెరగడం, పాకెట్ లాస్ సమస్యలు ఎదురవుతున్నట్లు గూగుల్ వెల్లడించింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటన కారణంగా డేటా సెంటర్‌లోని నెట్‌వర్కింగ్ పరికరాలకు అత్యవసరంగా విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో ఢిల్లీలో ఉన్న గూగుల్ క్లౌడ్ స్థానిక పాయింట్ ఆఫ్ ప్రజెన్స్ (పీవోపీ) వ్యవస్థ తాత్కాలికంగా వేరుపడటంతో నెట్‌వర్క్ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు ఢిల్లీలోని ప్రభావిత కేంద్రం నుంచి భారీ స్థాయిలో నెట్‌వర్క్ ట్రాఫిక్‌ను ఇతర ప్రాంతాలకు మళ్లించినట్లు గూగుల్ తెలిపింది. అయితే ప్రస్తుతం భారత్‌లోని మెట్రో నగరాలు, ప్రాంతీయ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల (ఐఎస్‌పీ) వద్ద డిమాండ్ అందుబాటులో ఉన్న సామర్థ్యాన్ని మించిపోవడంతో మధ్య మధ్యలో లేటెన్సీ పెరుగుతోందని పేర్కొంది.
సమస్య పరిష్కారానికి చర్యలు..
సమస్య పరిష్కారానికి అదనపు ట్రాఫిక్ మిటిగేషన్ చర్యలు, ఇంటర్‌నెట్ ఎడ్జ్ పీరింగ్ సామర్థ్యాన్ని పెంచే చర్యలు చేపడుతున్నట్లు గూగుల్ క్లౌడ్ సర్వీస్ హెల్త్ డ్యాష్ బోర్డులో వెల్లడించింది. ప్రభావిత డేటా సెంటర్ నుపూర్తిస్థాయిలో పునరుద్ధరించే వరకు వినియోగదారులు కొంత మేర అధిక లేటెన్సీ, అసాధారణ నెట్‌వర్క్ రూటింగ్ సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని గూగుల్ హెచ్చరించింది. ఈ అంతరాయం కారణంగా గూగుల్ క్లౌడ్ మౌలిక సదుపాయాలపై ఆధారపడే వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు, ఎంటర్‌ప్రైజ్ సేవలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రియల్‌టైమ్ డేటా ప్రాసెసింగ్, క్లౌడ్ ఆధారిత వ్యాపార సేవలు నిర్వహించే సంస్థలు తాత్కాలిక పనితీరు సమస్యలను ఎదుర్కొంటాయి.
తాజావార్తలు
- ●PM Modi | సుపరిపాలనకు అదే అసలైన పరీక్ష : ప్రధాని మోదీ
- ●CM Revanth Reddy | ఆ వ్యాఖ్యలు పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం.. రేవంత్‌పై కాంగ్రెస్ అధిష్టానం ఫైర్
- ●Gold | బంగారంపై మరిన్ని ఆంక్షలకు సిద్ధమవుతున్న కేంద్రం..?
- ●Jio | జియో రూ.899 ప్లాన్.. 90 రోజుల వ్యాలిడిటీతో భారీ డేటా, ఫ్రీ ఓటీటీ..
- ●Trinamool MP | టీఎంసీకి మరో షాక్.. మరో ఎంపీ రాజీనామా
- ●Claude | క్లాడ్ ఫేబుల్ 5, మైథోస్ 5 వచ్చేశాయ్.. కొత్త ఏఐ మోడల్స్‌ను లాంచ్ చేసిన ఆంథ్రోపిక్..

PM Modi | సుపరిపాలనకు అదే అసలైన పరీక్ష : ప్రధాని మోదీ

CM Revanth Reddy | ఆ వ్యాఖ్యలు పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం.. రేవంత్‌పై కాంగ్రెస్ అధిష్టానం ఫైర్

Gold | బంగారంపై మరిన్ని ఆంక్షలకు సిద్ధమవుతున్న కేంద్రం..?

Jio | జియో రూ.899 ప్లాన్.. 90 రోజుల వ్యాలిడిటీతో భారీ డేటా, ఫ్రీ ఓటీటీ..






