త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jio | జియో రూ.899 ప్లాన్.. 90 రోజుల వ్యాలిడిటీతో భారీ డేటా, ఫ్రీ ఓటీటీ..

Jio | జియో సిమ్ ఉపయోగిస్తున్న వారు ఎక్కువ వ్యాలిడిటీ, భారీ డేటా బెనిఫిట్స్, అదనపు ఓటీటీ సదుపాయాలు కోరుకుంటే, జియో రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ మంచి ఎంపికగా నిలుస్తోంది. ఈ ప్లాన్‌లో దీర్ఘకాల వ్యాలిడిటీతోపాటు డేటా, కాలింగ్, వినోద ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

S

Technology | Published On Jun 10, 2026, 12.03 pm IST

Jio | జియో రూ.899 ప్లాన్.. 90 రోజుల వ్యాలిడిటీతో భారీ డేటా, ఫ్రీ ఓటీటీ..
Advertisement

Jio | జియో సిమ్ ఉపయోగిస్తున్న వారు ఎక్కువ వ్యాలిడిటీ, భారీ డేటా బెనిఫిట్స్, అదనపు ఓటీటీ సదుపాయాలు కోరుకుంటే, జియో రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ మంచి ఎంపికగా నిలుస్తోంది. ఈ ప్లాన్‌లో దీర్ఘకాల వ్యాలిడిటీతోపాటు డేటా, కాలింగ్, వినోద ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. జియో రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 2జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అలాగే వినియోగదారులకు 20జీబీ బోనస్ డేటాను కూడా అందిస్తారు. దీంతో మొత్తం 200జీబీ డేటా ప్రయోజనం లభిస్తుంది. నిర్ణీత డేటా పరిమితి పూర్తైన తర్వాత ఇంటర్నెట్ వేగం 64కేబీపీఎస్‌కు తగ్గుతుంది. కాలింగ్ విషయంలో అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

అన్‌లిమిటెడ్ ట్రూ 5జీ..

ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. అర్హత కలిగిన వినియోగదారులకు జియో అన్‌లిమిటెడ్ ట్రూ 5జీ సేవలు అందుతాయి. అదనంగా మూడు నెలల పాటు జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీని ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్‌ను వీక్షించే అవకాశం ఉంటుంది. అలాగే జియో ఏఐ క్లౌడ్ ద్వారా 50జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ ను కూడా ఇస్తారు. ఈ ప్లాన్‌తో గూగుల్ జెమినీ ప్రోకు 18 నెలల సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దీని అంచనా విలువను సుమారు రూ.35,100గా పేర్కొంటున్నారు.అంతేకాకుండా వినియోగదారులు 5000జీబీ వరకు క్లౌడ్ స్టోరేజ్ యాక్సెస్‌తో పాటు పలు అధునాతన ఏఐ ఫీచర్లను కూడా ఉపయోగించుకునే అవకాశం పొందుతారు.

Advertisement
Advertisement