Gemini AI | జెమిని ఏఐ యూజర్లకు షాక్.. కొత్త యూసేజ్ లిమిట్స్‌తో తలనొప్పులు..
Gemini AI | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన ఏఐ ప్లాట్‌ఫామ్ జెమినిలో ఇటీవల భారీ మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్ ఏఐ ప్లాట్‌ఫామ్ తరహాలో జెమినిలోనూ యూసేస్ లిమిట్స్ విధానాన్ని మార్చింది.
Technology | Published On May 22, 2026, 1.55 pm IST
Gemini AI | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన ఏఐ ప్లాట్‌ఫామ్ జెమినిలో ఇటీవల భారీ మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్ ఏఐ ప్లాట్‌ఫామ్ తరహాలో జెమినిలోనూ యూసేస్ లిమిట్స్ విధానాన్ని మార్చింది. అంతకు ముందు వరకు మెసేజ్‌ల సంఖ్య ఆధారంగా ఉన్న లిమిట్స్‌ను ప్రస్తుతం కంప్యూట్ బేస్డ్ యూసేజ్ లిమిట్ పేరిట మార్చి కొత్త లిమిట్స్ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే దీనిపై యూజర్లకు చిర్రెత్తుకు వస్తోంది. దీని వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని యూజర్లు సామాజిక మాధ్యమాల్లో భారీగా ఫిర్యాదు చేస్తున్నారు. సాధారణంగా మెసేజ్‌ల సంఖ్య ఆధారంగా లిమిట్స్ పెడితే యూజర్లకు కూడా లెక్కించడం సులభం అవుతుంది. కానీ కొత్త తరహా విధానంలో లిమిట్స్‌ను లెక్కిస్తుండడంతో యూజర్లు తాము ఎంత సమయం జెమినిని వాడింది, ఇంకా ఎంత సేపు వాడుకోవచ్చు.. అనే వివరాలను తెలుసుకోవడం కష్టంగా మారింది. కంప్యూట్ బేస్డ్ యూసేజ్ లిమిట్ వల్ల యూజర్లు ఎంత క్లిష్టమైన ప్రాంప్ట్‌లను ఇస్తున్నారు, ఎంత పెద్ద చాట్ చేస్తున్నారు, ఏయే ఫీచర్లను వాడుతున్నారు అనే అంశాల ఆధారంగా జెమినిలో లిమిట్స్ ఖర్చవుతాయి.
ఈ-మెయిల్ ద్వారా మాత్రమే సమాచారం..
ఇటీవలే వీక్లీ లిమిట్, కొత్త యూసేజ్ డ్యాష్‌బోర్డ్‌ను విడుదల చేసిన గూగుల్, ఇప్పుడు టోకెన్స్ వినియోగాన్ని ప్రధాన ప్రమాణంగా తీసుకోవడం ప్రారంభించింది. ఈ మార్పు వల్ల యూజర్ల అసలు వినియోగ సామర్థ్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మార్పును గూగుల్ అధికారిక బ్లాగ్ లేదా సోషల్ మీడియా ద్వారా ప్రకటించలేదు. బదులుగా యూజర్లకు ఈ-మెయిల్ పంపి సమాచారం అందించింది. ఆ ఈ-మెయిల్‌లో ప్రాంప్ట్ క్లిష్టత, ఉపయోగించిన ఫీచర్లు, చాట్ నిడివి ఆధారంగా కంప్యూట్-బేస్డ్ లిమిట్స్ అమలవుతాయని పేర్కొంది. కొత్త విధానంలో ఒక్కో ఫీచర్ ఎంత కంప్యూట్ ఖర్చు చేస్తుందో గూగుల్ స్పష్టంగా వెల్లడించలేదు. సపోర్ట్ పేజీలో మాత్రం ఫ్రీ టియర్‌కు స్టాండర్డ్ లిమిట్, ఏఐ ప్లస్‌కు 2ఎక్స్ స్టాండర్డ్, ఏఐ ప్రోకు 4x, 100 డాలర్ల ఏఐ అల్ట్రాకు 5ఎక్స్, 200 డాలర్ల ఏఐ అల్ట్రాకు 20ఎక్స్ లిమిట్ ఉంటుందని మాత్రమే తెలిపింది. పరీక్షల్లో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్ అకౌంట్‌లో ఒక నానో బనానా ప్రో ఇమేజ్ ను రూపొందించడానికి 5 గంటల లిమిట్‌లో 1 శాతం వినియోగమైంది. అదే గూగుల్ జెమిని 3.1 ప్రో (ఎక్స్‌టెండెడ్) ద్వారా ఒక డీప్ రీసెర్చ్ చేయడానికి 5 శాతం లిమిట్ ఖర్చైంది. ఇక ఒకే వీడియోను వియో 3 ద్వారా రూపొందించడానికి 26 శాతం వరకు 5 గంటల లిమిట్ వినియోగమైనట్లు గుర్తించారు.
చిన్న ప్రాంప్ట్‌లకే భారీగా లిమిట్స్ ఖర్చు..
ఈ పరీక్షల్లో సాధారణ ప్రాంప్ట్‌లనే ఉపయోగించినప్పటికీ, మరింత క్లిష్టమైన రిక్వెస్ట్‌లతో వినియోగం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా వెబ్ యాక్సెస్, ఏజెంటిక్ టూల్స్, జీమెయిల్, డ్రైవ్ కనెక్టర్లు, పెద్ద చాట్ హిస్టరీ వంటి అంశాలు టోకెన్ వినియోగాన్ని పెంచుతాయని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా యూజర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నోట్‌బుక్ ఎల్ఎం, గూగుల్ డాక్‌ను రిఫరెన్స్ చేసిన ఒకే ఒక్క ప్రాంప్ట్ 47 శాతం యూసేజ్‌ను తినేసిందని ఒక యూజర్ పేర్కొనగా, గూగుల్ సంస్థ జెమినిని పూర్తిగా నాశనం చేసిందని, ప్రో ప్లాన్‌లో స్టాండర్డ్ థింకింగ్ మోడల్‌తో ఐదు ప్రాంప్ట్‌లు మాత్రమే ఇచ్చినా 54 శాతం లిమిట్ పూర్తైందని మరో యూజర్ విమర్శించారు. ఇది మైక్రో ట్రాన్సాక్షన్ గేమ్‌లా మారిందని, ప్రతి ఐదు గంటలకు మళ్లీ వచ్చి కొంచెం పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. అయితే గూగుల్ జెమినిలో చాలా మంది కంటెంట్ క్రియేటర్లు అనవసర వీడియోలు, ఇమేజ్‌లను క్రియేట్ చేస్తున్నందునే ఏఐ ప్రాసెసింగ్ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయని, వాటిని తగ్గించేందుకే గూగుల్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ఆంథ్రోపిక్ తరహాలో యూసేజ్ లిమిట్స్‌ను అమలు చేస్తున్నప్పటికీ ఎంత యూసేజ్ ఉందో స్పష్టంగా తెలిపే డ్యాష్‌బోర్డ్ ను అందించకపోవడంతో యూజర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గూగుల్ దృష్టి సారిస్తుందేమో చూడాలి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Minister Ponnam Prabhakar | వరి కొయ్యకాలు తగులబెట్టవద్దు.. రైతులను కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Malayalam OTT | ఓటీటీలోకి మమ్ముట్టి, మోహన్‌లాల్ మలయాళ మల్టీస్టారర్ మూవీ - తెలుగులోనూ రిలీజ్
- ●Jagadeesh Reddy | డల్లాస్ వేడుకల స్ఫూర్తిగా మలేషియాలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు: జగదీశ్‌రెడ్డి
- ●Amit Shah | దేశ సరిహద్దులు ఇక స్మార్ట్‌గా..!
- ●realme Watch S5 | రూ.7,499కే రియల్‌మి వాచ్ ఎస్5.. జీపీఎస్, అమోలెడ్ డిస్ప్లేతో అదిరిపోయిన ఫీచర్లు..
- ●PMGSY | తెలంగాణకు అదనంగా నిధులివ్వాలి : మంత్రి సీతక్క

Minister Ponnam Prabhakar | వరి కొయ్యకాలు తగులబెట్టవద్దు.. రైతులను కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్

Malayalam OTT | ఓటీటీలోకి మమ్ముట్టి, మోహన్‌లాల్ మలయాళ మల్టీస్టారర్ మూవీ - తెలుగులోనూ రిలీజ్

Jagadeesh Reddy | డల్లాస్ వేడుకల స్ఫూర్తిగా మలేషియాలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు: జగదీశ్‌రెడ్డి

Amit Shah | దేశ సరిహద్దులు ఇక స్మార్ట్‌గా..!






