త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Prices | తులం బంగారం @ రూ.2 ల‌క్ష‌లు.. ఆ రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంది..?

Gold Prices | బంగారం ధ‌ర‌లు గ‌త వారంలో రికార్డు స్థాయిలో ఆల్ టైమ్ హై స్థాయిల‌ను తాకాయి. కానీ అక్కడ ఎక్కువ సేపు నిల‌వ‌లేదు. వెంట‌నే దిగివచ్చాయి. గత కొన్ని నెలలుగా నిరంతరంగా పెరిగిన బంగారం ధరలు కొనుగోలుదారులు, పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేశాయి.

S

Business | Published On Feb 3, 2026, 1.22 pm IST

Gold Prices | తులం బంగారం @ రూ.2 ల‌క్ష‌లు.. ఆ రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంది..?
Advertisement

Gold Prices | బంగారం ధ‌ర‌లు గ‌త వారంలో రికార్డు స్థాయిలో ఆల్ టైమ్ హై స్థాయిల‌ను తాకాయి. కానీ అక్కడ ఎక్కువ సేపు నిల‌వ‌లేదు. వెంట‌నే దిగివచ్చాయి. గత కొన్ని నెలలుగా నిరంతరంగా పెరిగిన బంగారం ధరలు కొనుగోలుదారులు, పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేశాయి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఇప్పటికీ లాభాల్లో ఉన్నప్పటికీ, ఇటీవలే బంగారంలో పెట్టుబడి పెట్టిన వారు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పలు అంతర్జాతీయ సంస్థలు 2026 చివరి నాటికి బంగారం ధరలపై అంచనాల‌ను విడుదల చేశాయి. బ్యాంకింగ్ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం జేపీ మోర్గాన్ ప్రకటించిన అంచనాలు మార్కెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ధరలు భారీగా పడిపోయిన తర్వాతే ఈ అంచనాలు రావడం విశేషం.

2026 చివ‌రి నాటికి రూ.2 ల‌క్ష‌ల మార్కుకు..

జేపీ మోర్గాన్ అంచనాల ప్రకారం, 2026 చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఔన్సుకు 6,300 డాలర్ల వరకు చేరవచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో భారత్‌లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.2 లక్షల మార్కును దాటే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే జరిగితే దేశీయ మార్కెట్‌లో బంగారం కొత్త రికార్డులను సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. కేంద్ర బ్యాంకులు, పెద్ద పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ కొనసాగుతుండటమే ఈ అంచనాలకు ప్రధాన కారణమని జేపీ మోర్గాన్ స్పష్టం చేసింది. ఇటీవల ధరల్లో ఊగిసలాట ఉన్నప్పటికీ, మధ్యకాలంలో బంగారంపై మా అంచనాలు పూర్తిగా సానుకూలంగానే ఉన్నాయి. నిజమైన ఆస్తుల వైపు పెట్టుబడులు మళ్లే ధోరణి ఇంకా కొనసాగనుంది, అని సంస్థ తన నివేదికలో పేర్కొంది.

ఇక దేశీయ మార్కెట్‌లో ప్రస్తుతం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధ‌ర 10 గ్రాముల‌కు రూ.1,51,750 వ‌ద్ద కొన‌సాగుతండ‌గా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర 10 గ్రాముల‌కు రూ.1,39,100గా ఉంది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధ‌ర 10 గ్రాముల‌కు రూ.1,13,800గా ఉంది. కాగా కమోడిటీ మార్కెట్‌లో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధరలు మంగళవారం 1.55 శాతం తగ్గి, 10 గ్రాములకు రూ.1,45,461 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. కింద‌టి రోజు ముగింపు ధర రూ.1,47,753తో పోలిస్తే ఇది గణనీయమైన తగ్గుదల కావ‌డం గ‌మ‌నార్హం.

Advertisement
Advertisement