Gold-Silver Rate | ధన్‌తేరస్ వేళ వెలవెలబోయిన బంగారం.. వెండి మెరుపులు.. ధరలు భారీగా పతనం..!
Gold-Silver Rate | ధన్‌తేరస్ బంగారం, వెండి కొనుగోళ్లకు అత్యంత శుభప్రదమైన రోజు. లక్ష్మీదేవి, కుబేరుడు, ధన్వంతరి దేవతలను పూజిస్తూ ఈ పర్వదినాన బంగారం, వెండి కొనుగోలు చేస్తే సంపద, సౌభాగ్యం కలుగుతాయని ప్రజల విశ్వాసం. అయితే ఈసారి మాత్రం పండుగ సందడి బులియన్ మార్కెట్‌లో కనిపించలేదు.
Gold-Silver Rate | ధన్‌తేరస్ బంగారం, వెండి కొనుగోళ్లకు అత్యంత శుభప్రదమైన రోజు. లక్ష్మీదేవి, కుబేరుడు, ధన్వంతరి దేవతలను పూజిస్తూ ఈ పర్వదినాన బంగారం, వెండి కొనుగోలు చేస్తే సంపద, సౌభాగ్యం కలుగుతాయని ప్రజల విశ్వాసం. అయితే ఈసారి మాత్రం పండుగ సందడి బులియన్ మార్కెట్‌లో కనిపించలేదు. ఒకవైపు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరడం.. మరోవైపు ధరల భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి కొనుగోలుదారులను వెనక్కి తగ్గేలా చేశాయి. దీంతో ధన్‌తేరస్ వేళ కూడా బంగారం, వెండి విక్రయాలు ఆశించిన స్థాయిలో సాగలేదు.
బంగారం ధర రూ.2,500 డౌన్..
దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ గణాంకాల ప్రకారం.. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.2,500 తగ్గి రూ.1,46,300కు చేరింది. గురువారం ఈ ధర రూ.1,48,800గా నమోదైంది. మరోవైపు కిలో వెండి ధర సైతం రూ.2,000 తగ్గింది. దీంతో గురువారం రూ.1,94,500గా ఉన్న కిలో వెండి ధర శుక్రవారం రూ.1,92,500కు చేరింది. ఈ ధరలు అన్ని పన్నులతో కలిపినవి.
భారీ ధరలతో కొనుగోలుదారుల వెనుకడుగు..
సాధారణంగా ధన్‌తేరస్ సందర్భంగా ఆభరణాల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. అయితే ఈసారి అధిక ధరల కారణంగా కొనుగోళ్లలో జోరు కనిపించలేదు. గతేడాదితో పోలిస్తే అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి లేదని పలువురు ప్రముఖ జ్యువెలరీ వ్యాపారులు పేర్కొంటున్నారు. ధరలు మరింత పెరుగుతాయా? తగ్గుతాయా? అన్న సందిగ్ధత కూడా వినియోగదారులను ఆలోచనలో పడేసింది. దీంతో భారీ ఆభరణాల కంటే తక్కువ బరువున్న లైట్ వెయిట్ జ్యువెలరీ కొనుగోలుకే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.
గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగిన ధరలు..
గతేడాది ధన్‌తేరస్ (18 అక్టోబర్ 2025)తో పోలిస్తే ఈసారి బంగారం, వెండి ధరలు గణనీయంగా అధికంగా ఉన్నాయి. గతేడాది 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,400గా ఉండగా.. ప్రస్తుతం రూ.1,46,300కు చేరింది. అలాగే కిలో వెండి ధర గతేడాది రూ.1,70,000గా ఉండగా.. ప్రస్తుతం రూ.1,92,500కు పెరిగింది. ఏడాది వ్యవధిలోనే విలువైన లోహాల ధరలు భారీగా పెరగడంతో పండుగ వేళ కొనుగోళ్లపై ప్రభావం పడింది.
బంగారు ఆభరణాల డిమాండ్ 20 శాతం డౌన్..
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తాజా గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్‌లో బంగారు ఆభరణాల డిమాండ్ పరిమాణం పరంగా 20 శాతం తగ్గింది. అయితే విలువ పరంగా మాత్రం గతేడాదితో పోలిస్తే 16 శాతం వృద్ధి నమోదైంది. అంటే ధరలు పెరగడంతో తక్కువ పరిమాణంలో బంగారం కొనుగోలు చేసినప్పటికీ, మొత్తం కొనుగోళ్ల విలువ పెరిగిందన్నమాట. ఈ సందర్భంగా యూటీఐ ఏఎంసీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఫండ్ మేనేజర్ శర్వన్ గోయల్ మాట్లాడుతూ.. బంగారం విలువను నిల్వ చేసుకునే సాధనంగానే కాకుండా పెట్టుబడుల విస్తరణకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వెండి విషయానికి వస్తే సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) వంటి పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, అయితే బంగారంతో పోలిస్తే వెండి ధరల్లో ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయని వివరించారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో మిశ్రమ ధోరణి..
అంతర్జాతీయ మార్కెట్లలోనూ విలువైన లోహాల ధరలు మిశ్రమంగా కదలాడాయి. స్పాట్ గోల్డ్ ధర 0.5 శాతం (20.41 డాలర్లు) తగ్గి ఔన్సుకు 4,068.71 డాలర్లకు చేరింది. మరోవైపు స్పాట్ సిల్వర్ ధర స్వల్పంగా పెరిగి ఔన్సుకు 52 డాలర్ల వద్ద ట్రేడయింది. ధన్‌తేరస్ సెంటిమెంట్‌తో బంగారం, వెండి కొనుగోళ్లు కొనసాగినప్పటికీ అధిక ధరలు, మార్కెట్ అనిశ్చితి కారణంగా అమ్మకాల పరిమాణం ఆశించిన స్థాయిలో లేదు. సంప్రదాయ కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తూనే వినియోగదారులు తక్కువ బరువున్న ఆభరణాలు, పెట్టుబడి ప్రత్యామ్నాయాల వైపు మొగ్గుచూపుతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CBSE | సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..! ఫుల్ టైమ్ టేబుల్ ఇదే..!
నవంబర్ 6, 2026

Alert | దీపావళి వేళ రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుశిక్షే..!
నవంబర్ 6, 2026

Nitin Nabin | కరీంనగర్ పాదయాత్రకు నేనొస్తా.. బండికి నితిన్ నబిన్ హామీ
నవంబర్ 6, 2026
తాజావార్తలు
- ●CBSE | సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..! ఫుల్ టైమ్ టేబుల్ ఇదే..!
- ●Alert | దీపావళి వేళ రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుశిక్షే..!
- ●Nitin Nabin | కరీంనగర్ పాదయాత్రకు నేనొస్తా.. బండికి నితిన్ నబిన్ హామీ
- ●SIR | ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతయ్యాయా? ఓటర్లకు ఈసీ మరో ఛాన్స్..!
- ●Gadwal Vijaya Laxmi | ఫీజులు తీసుకుని సర్టిఫికెట్లు ఆపేస్తారా?.. నల్ల మల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్‌పై విజయలక్ష్మి ఆగ్రహం
- ●Bigg Boss | భయపెట్టబోతున్న బిగ్‌బాస్ విన్నర్ - హారర్ కామెడీ మూవీతో హీరోగా ఎంట్రీ

CBSE | సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..! ఫుల్ టైమ్ టేబుల్ ఇదే..!

Alert | దీపావళి వేళ రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుశిక్షే..!

Nitin Nabin | కరీంనగర్ పాదయాత్రకు నేనొస్తా.. బండికి నితిన్ నబిన్ హామీ

SIR | ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతయ్యాయా? ఓటర్లకు ఈసీ మరో ఛాన్స్..!



