త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Rates 28th January 2026 | రూ.4 ల‌క్ష‌ల మార్కుకు చేరువ‌లో వెండి.. బంగారం ధ‌ర‌లోనూ పెరుగుద‌ల‌.. ఇప్పుడే కొనాలా..?

Gold And Silver Rates 28th January 2026 | దేశీయ కమోడిటీ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు బుధవారం (జనవరి 28, 2026) భారీగా పెరిగాయి. స్పాట్ మార్కెట్ ల‌లోనూ ఈ లోహాల ధ‌ర‌ల్లో గ‌ణ‌నీయ‌మైన పెరుగుద‌ల క‌నిపించింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో రెండు లోహాలు ఆల్ టైమ్ హై స్థాయిలను తాకాయి.

S

Business | Published On Jan 28, 2026, 11.45 am IST

Gold And Silver Rates 28th January 2026 | రూ.4 ల‌క్ష‌ల మార్కుకు చేరువ‌లో వెండి.. బంగారం ధ‌ర‌లోనూ పెరుగుద‌ల‌.. ఇప్పుడే కొనాలా..?
Advertisement

Gold And Silver Rates 28th January 2026 | దేశీయ కమోడిటీ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు బుధవారం (జనవరి 28, 2026) భారీగా పెరిగాయి. స్పాట్ మార్కెట్ ల‌లోనూ ఈ లోహాల ధ‌ర‌ల్లో గ‌ణ‌నీయ‌మైన పెరుగుద‌ల క‌నిపించింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో రెండు లోహాలు ఆల్ టైమ్ హై స్థాయిలను తాకాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సేఫ్ హేవెన్ పెట్టుబడులపై పెరిగిన ఆసక్తి ఈ ర్యాలీకి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. MCXలో ఫిబ్రవరి 5, 2026 డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 3 శాతం (రూ.4,800) పెరిగి 10 గ్రాములకు రూ.1,62,429 కు చేరింది. అదే విధంగా మార్చి 5, 2026 డెలివరీ సిల్వర్ ఫ్యూచర్స్ ధర 6 శాతం (రూ.21,400) పెరిగి కిలోకు రూ.3,77,655 వద్ద ట్రేడ్ అవుతోంది.

సురక్షిత పెట్టుబ‌డుల‌పై ఆస‌క్తి..

అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. బుధవారం ఔన్స్‌కు 5,200 డాలర్ల మార్క్‌ను దాటింది. అమెరికన్ డాలర్ విలువ దాదాపు నాలుగేళ్ల కనిష్టానికి చేరుకోవడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయానికి ముందే ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గుచూపడం దీనికి కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. స్పాట్ సిల్వర్ ధర ఔన్స్‌కు 0.6 శాతం పెరిగి 113.63 డాలర్లకు చేరింది. సోమవారం ఇది ఇప్పటికే 117.69 డాలర్ల రికార్డు స్థాయిని తాకింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు వెండి ధరలు దాదాపు 60 శాతం వరకు పెరిగాయి.

కాస్త త‌గ్గితే కొనాలి..

ఇన్వెస్టర్లు ఇప్పుడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయంపై దృష్టి సారించారు. వడ్డీ రేట్లను నిలిపివేయడం లేదా తగ్గించే సంకేతాలు ఇస్తే, బాండ్ ఈల్డ్స్ తగ్గి బంగారం, వెండి వంటి సేఫ్ హేవెన్ ఆస్తులపై డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఇదే విష‌యంపై ప్రిథ్వీ ఫిన్‌మార్ట్‌కు చెందిన కమోడిటీ నిపుణుడు మనోజ్ కుమార్ జైన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, డాలర్ ఇండెక్స్ తీవ్రంగా పడిపోవడం, జపాన్ యెన్ బలపడటం, గ్రీన్‌ల్యాండ్ అంశం నేపథ్యంలో, యూరప్ దేశాలు అమెరికన్ ట్రెజరీలను అమ్మే అవకాశం ఉందన్న భయాలు డాలర్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉంద‌ని, కానీ తాత్కాలికంగా భారీ ఒడిదుడుకులు కనిపించే అవకాశం ఉందన్నారు. అయితే ఇలాంటి త‌రుణంలో ధ‌ర‌లు కాస్త త‌గ్గిన‌ప్పుడు వాటిల్లో పెట్టుబ‌డులు పెడితే మంచిద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

స్వ‌ల్ప కాలిక ట్రేడ్ ల‌క్ష్యాలు..

ప్ర‌స్తుతం అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ స‌పోర్ట్ $4,980 వ‌ద్ద కొన‌సాగుతుండ‌గా, వెండికి స‌పోర్ట్ $98 వ‌ద్ద ఉంది. స్వ‌ల్ప‌కాలంలో బంగారం $5055 నుంచి $5220 మ‌ధ్య ట్రేడ్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తుండగా, వెండి $98 నుంచి $118 మ‌ధ్య ట్రేడ్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇక MCX లో బంగారం ధర రూ.1,55,000 నుంచి రూ.1,62,000 మ‌ధ్య ట్రేడ్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. అలాగే స్వ‌ల్ప కాలంలో MCX లో వెండి రూ.3,44,000 నుంచి రూ.3,78,000 మ‌ధ్య ట్రేడ్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అయితే బంగారం ధ‌ర రూ.1,56,000, వెండి ధ‌ర రూ.3,44,000 వ‌ద్ద నిలిస్తే మ‌ళ్లీ కొనుగోళ్లు చేయ‌వ‌చ్చ‌ని, కానీ స్వ‌ల్ప కాలిక గ‌రిష్ట ధ‌ర‌కు చేర‌గానే మ‌ళ్లీ విక్ర‌యించాల‌ని తెలిపారు.

బంగారం స్పాట్ మార్కెట్ ధ‌ర‌లు..

ఇక స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధ‌ర రూ.1,18,872 ఉండ‌గా, 24 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధ‌ర రూ.1,29,672గా ఉంది. అలాగే ముంబైలో 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర రూ.1,18,752 ఉండ‌గా, 24 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధ‌ర రూ.1,29,55గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.1,19,672, 24 క్యారెట్ల ధ‌ర రూ.1,30,552గా ఉన్నాయి. హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధ‌ర రూ.1,18,752 ఉండ‌గా, 24 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధ‌ర రూ.1,29,552గా ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement