త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో లాభాల స్వీక‌ర‌ణ‌.. అమ్మ‌కాల ఒత్తిడిలో ప‌సిడి, వెండి..

Gold And Silver Prices Today | గ‌త కొంత కాలంగా ఈక్విటీ మార్కెట్ల‌తోపాటు బులియ‌న్ మార్కెట్ల‌లోనూ తీవ్ర‌మైన హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటున్నాయి. ప‌శ్చిమ ఆసియాలో యుద్ధం ముగింపుపై సందిగ్ధ‌త నెల‌కొన‌డం, పెరుగుతున్న ముడి చ‌మురు ధ‌ర‌ల కార‌ణంగా ఈక్విటీ మార్కెట్లు న‌ష్టాల్లో ఉన్నాయి.

S

Business | Published On Nov 13, 2026, 11.10 am IST

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో లాభాల స్వీక‌ర‌ణ‌.. అమ్మ‌కాల ఒత్తిడిలో ప‌సిడి, వెండి..
Advertisement

Gold And Silver Prices Today | గ‌త కొంత కాలంగా ఈక్విటీ మార్కెట్ల‌తోపాటు బులియ‌న్ మార్కెట్ల‌లోనూ తీవ్ర‌మైన హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటున్నాయి. ప‌శ్చిమ ఆసియాలో యుద్ధం ముగింపుపై సందిగ్ధ‌త నెల‌కొన‌డం, పెరుగుతున్న ముడి చ‌మురు ధ‌ర‌ల కార‌ణంగా ఈక్విటీ మార్కెట్లు న‌ష్టాల్లో ఉన్నాయి. అయితే ఈ నెల‌లోనే భౌగోళిక, రాజ‌కీయ ప‌రిణామాల్లో పెను మార్పులు చోటు చేసుకోవ‌డంతో ఈక్విటీ, బులియ‌న్ మార్కెట్ల‌కు ఊపు వ‌చ్చింది. కానీ పెట్టుబ‌డిదారులు లాభాల స్వీక‌ర‌ణ‌కు మొగ్గు చూపుతుండ‌డంతో మార్కెట్ల‌లో తీవ్ర‌మైన అస్థిర‌త నెల‌కొంటోంది. ఇక శుక్ర‌వారం సైతం మార్కెట్ల‌లో తీవ్ర‌మైన హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటున్నాయి. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర 1.06 శాతం ఎగ‌బాకి 3,919 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 0.56 శాతం పెరిగి 50 డాల‌ర్ల‌కు చేరుకుంది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1162 పాయింట్లు పెరిగి 1,37,387కు చేర‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 393 పాయింట్లు పెరిగి 1,78,926కు వ‌చ్చింది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గ‌గా, వెండి ధ‌ర‌ల్లో స్వ‌ల్ప త‌గ్గుద‌ల చోటు చేసుకుంది.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,849 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,10,792 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,38,490 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,84,900 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.13,100 త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.12,695 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,01,560గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,26,950 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.12,69,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.12,000 త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.10,387 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.83,096గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,03,870 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.10,38,700గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.9,800 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.1,99,900 ఉండ‌గా, తులం ధ‌ర రూ.1,999గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర కిలోకు స్వ‌ల్పంగా రూ.100 త‌గ్గింది. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.1,99,900 ఉండ‌గా, తులం ధ‌ర రూ.1,999 గా ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement