త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | బంగారం ధ‌ర‌ల్లో తీవ్ర హెచ్చుత‌గ్గులు.. జాగ్ర‌త్త అంటున్న నిపుణులు..

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో కొన‌సాగుతున్న తీవ్ర యుద్ధం కార‌ణంగా ఈక్విటీ మార్కెట్ల‌లో భారీ న‌ష్టాలు వ‌స్తున్నాయి. పెట్టుబ‌డిదారుల‌పై తీవ్ర అమ్మ‌కాల ఒత్తిడి ఉండ‌డంతో షేర్ల‌ను భారీ ఎత్తున విక్ర‌యిస్తున్నారు.

S

Business | Published On Sep 23, 2026, 11.13 am IST

Gold And Silver Prices Today | బంగారం ధ‌ర‌ల్లో తీవ్ర హెచ్చుత‌గ్గులు.. జాగ్ర‌త్త అంటున్న నిపుణులు..
Advertisement

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో కొన‌సాగుతున్న తీవ్ర యుద్ధం కార‌ణంగా ఈక్విటీ మార్కెట్ల‌లో భారీ న‌ష్టాలు వ‌స్తున్నాయి. పెట్టుబ‌డిదారుల‌పై తీవ్ర అమ్మ‌కాల ఒత్తిడి ఉండ‌డంతో షేర్ల‌ను భారీ ఎత్తున విక్ర‌యిస్తున్నారు. మ‌రోవైపు బులియ‌న్ మార్కెట్ల‌లో గ‌త కొద్ది రోజులుగా ర్యాలీ కొన‌సాగిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం అనిశ్చితి నెల‌కొంది. పెట్టుబ‌డిదారులు రిస్క్ తీసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. దీంతో బంగారం, వెండి ధ‌ర‌ల్లో తీవ్ర హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటున్నాయి. బుధ‌వారం అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్‌ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర 0.44 శాతం త‌గ్గి 4,338 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 0.92 శాతం త‌గ్గి 66 డాలర్ల‌కు వ‌చ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 113 పాయింట్లు త‌గ్గి 1,52,603 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 559 పాయింట్లు పెరిగి 2,40,439 వ‌ద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు భారీగా పెర‌గ్గా, వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,420 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,23, 360 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,54,200 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,42,000 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.8,700 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,135 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,13,080గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,41,350 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,13,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.8,000 పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,565 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.92,520గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,15,650 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,56,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.6,500 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,50,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,500గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,55,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,550 గా ఉంది.

Advertisement
Advertisement