త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apple Mac Mini | యాపిల్‌ కొత్త మ్యాక్‌ మినీ, మ్యాక్‌ స్టూడియో వచ్చేశాయి.. ధరలు ఇవే..

Apple Mac Mini | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న నూత‌న మ్యాక్ డెస్క్‌టాప్ పీసీల‌ను లాంచ్ చేసింది. గత నెలలో పరిచయం చేసిన కొత్త డిజైన్‌తో కూడిన మ్యాక్‌ మినీ, అప్‌డేట్‌ చేసిన మ్యాక్‌ స్టూడియో ఇప్పుడు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. యాపిల్‌ తాజా తరం చిప్‌ల ఆధారంగా రూపొందించిన ఈ రెండు కంప్యూటర్లలో కంప్యూటింగ్‌ సామర్థ్యం, స్థానిక కృత్రిమ మేధ ప్రాసెసింగ్‌, యూనిఫైడ్‌ మెమరీ బ్యాండ్‌విడ్త్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించింది.

S

Technology | Published On Sep 23, 2026, 10.55 am IST

Apple Mac Mini | యాపిల్‌ కొత్త మ్యాక్‌ మినీ, మ్యాక్‌ స్టూడియో వచ్చేశాయి.. ధరలు ఇవే..
Advertisement

Apple Mac Mini | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న నూత‌న మ్యాక్ డెస్క్‌టాప్ పీసీల‌ను లాంచ్ చేసింది. గత నెలలో పరిచయం చేసిన కొత్త డిజైన్‌తో కూడిన మ్యాక్‌ మినీ, అప్‌డేట్‌ చేసిన మ్యాక్‌ స్టూడియో ఇప్పుడు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. యాపిల్‌ తాజా తరం చిప్‌ల ఆధారంగా రూపొందించిన ఈ రెండు కంప్యూటర్లలో కంప్యూటింగ్‌ సామర్థ్యం, స్థానిక కృత్రిమ మేధ ప్రాసెసింగ్‌, యూనిఫైడ్‌ మెమరీ బ్యాండ్‌విడ్త్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ కొత్త కంప్యూటర్లు మ్యాక్ ఓఎస్ 27 ఆధారంగా పనిచేస్తాయి. ఒక్కో జీపీయూ కోర్‌లోనే న్యూరల్‌ యాక్సిలరేటర్లను అందించడంతోపాటు, అప్‌గ్రేడ్‌ చేసిన న్యూరల్‌ ఇంజిన్లను కలిగి ఉన్నాయి. దీంతో పరికరంలోనే కృత్రిమ మేధ ఆధారిత పనులు, మెషిన్‌ లెర్నింగ్‌ ప్రక్రియలను నిర్వహించే సామర్థ్యం మరింత పెరుగుతుంది.

మ్యాక్ మినీ ఫీచ‌ర్లు..

కొత్త మ్యాక్‌ మినీ సాధారణ వినియోగదారులు, డెవలపర్లు, క్రియేటివ్‌ ప్రొఫెషనల్స్‌ను లక్ష్యంగా చేసుకుని లాంచ్ చేశారు. తక్కువ స్థలంలో ఏర్పాటు చేసుకునేలా రూపొందించిన ఈ డెస్క్‌టాప్‌ రెండు ప్రధాన కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. వీటిలో ఎం6, ఎం5 ప్రొ చిప్‌లను అందించారు. ఎం6 వెర్షన్‌లో 12 కోర్‌ సీపీయూ, 12 కోర్‌ జీపీయూ ఉన్నాయి. ప్రతి జీపీయూ కోర్‌లో న్యూరల్‌ యాక్సిలరేటర్‌ను అందించారు. డ్యుయల్ 16 కోర్‌ న్యూరల్‌ ఇంజిన్‌తో గత తరం కంటే కృత్రిమ మేధ పనితీరు 4 రెట్లు వేగంగా ఉంటుందని యాపిల్‌ తెలిపింది. సీపీయూ పనితీరు 40 శాతం, గ్రాఫిక్స్‌, అంతర్గత స్టోరేజ్‌ వేగం రెండింతలు పెరిగినట్లు పేర్కొంది. ఎం6 మ్యాక్‌ మినీ 16 జీబీ యూనిఫైడ్‌ మెమరీతో ప్రారంభమవుతుంది. దీనిని 32 జీబీ వరకు పెంచుకోవచ్చు. మెమరీ బ్యాండ్‌విడ్త్‌ గరిష్ఠంగా సెకనుకు 170 జీబీ వరకు ఉంటుంది. ఇక ఎం5 ప్రొ వెర్షన్‌లో గరిష్ఠంగా 18 కోర్‌ సీపీయూ, 20 కోర్‌ జీపీయూ, 64 జీబీ వరకు యూనిఫైడ్‌ మెమరీ, సెకనుకు 307 జీబీ మెమరీ బ్యాండ్‌విడ్త్‌ లభిస్తాయి. రెండు మ్యాక్‌ మినీ మోడళ్లలోనూ వైఫై 7, బ్లూటూత్‌ 6, 2.5 గిగాబిట్‌ ఈథర్‌నెట్‌ కనెక్షన్‌ ఉన్నాయి. అవసరమైతే 10 గిగాబిట్‌ ఈథర్‌నెట్‌ ఆప్షన్‌ను అదనంగా ఎంచుకోవచ్చు.

మ్యాక్‌ స్టూడియోలో భారీ స్పెసిఫికేషన్లు..

మ్యాక్‌ స్టూడియో యాపిల్‌ వర్క్‌స్టేషన్‌ తరహా డెస్క్‌టాప్‌గా కొనసాగుతోంది. 3డి రెండరింగ్‌, కంప్రెస్డ్‌ కాకుండా 8కె వీడియో ప్రాసెసింగ్‌, డివైస్‌లోనే భారీ లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడళ్లను అమలు చేయడం వంటి అధిక కంప్యూటింగ్‌ అవసరమయ్యే పనుల కోసం దీనిని రూపొందించారు. ఇది ఎం5 మ్యాక్స్‌, ఎం5 అల్ట్రా చిప్‌లతో లభిస్తుంది. ఎం5 మ్యాక్స్‌ వెర్షన్‌లో 18 కోర్‌ సీపీయూ, గరిష్ఠంగా 40 కోర్‌ జీపీయూ ఉన్నాయి. ప్రతి జీపీయూ కోర్‌లో న్యూరల్‌ యాక్సిలరేటర్లు ఉంటాయి. ఇందులో యూనిఫైడ్‌ మెమరీని గరిష్ఠంగా 128 జీబీ వరకు కాన్ఫిగర్‌ చేసుకోవచ్చు. ఎం5 అల్ట్రా వెర్షన్‌లో గరిష్ఠంగా 36 కోర్‌ సీపీయూ, 80 కోర్‌ జీపీయూ ఉంటాయి. యూనిఫైడ్‌ మెమరీని ఏకంగా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. మెమరీ బ్యాండ్‌విడ్త్‌ గరిష్ఠంగా సెకనుకు 1.2 టెరాబైట్‌లకు చేరుతుంది. గత తరంతో పోలిస్తే కృత్రిమ మేధ కంప్యూటింగ్‌ పనితీరు 4.3 రెట్లు, గ్రాఫిక్స్‌ పనితీరు 1.8 రెట్లు పెరిగినట్లు యాపిల్‌ తెలిపింది.

 

మ్యాక్‌ స్టూడియోలో థండర్‌బోల్ట్‌ 5 కనెక్షన్‌ ద్వారా సెకనుకు 120 గిగాబిట్‌ల వరకు డేటా బదిలీ వేగం లభిస్తుంది. హై బ్యాండ్‌విడ్త్‌ స్టోరేజ్‌ అర్రేలు, ఎక్స్‌టర్నల్‌ పీసీఐఈ విస్తరణ వ్యవస్థలను కనెక్ట్‌ చేసుకోవచ్చు. థండర్‌బోల్ట్‌ 5లోని ఆర్‌డీఎంఏ సాంకేతికతతో పలు మ్యాక్‌ స్టూడియోలను నెట్‌వర్క్‌ చేసి, పంపిణీ చేసిన కృత్రిమ మేధ ఇన్‌ఫరెన్స్‌ పనుల్లో ఒకే మ్యాక్‌ స్టూడియోతో పోలిస్తే 3 రెట్ల వరకు వేగాన్ని సాధించవచ్చని యాపిల్‌ చెబుతోంది. ఇందులో గరిష్ఠంగా ఎనిమిది స్వతంత్ర డిస్‌ప్లేలను లేదా స్థానిక 5కె రిజల్యూషన్‌, 120 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 4 స్టూడియో డిస్‌ప్లే ఎక్స్‌డీఆర్‌ మానిటర్లను క‌నెక్ట్ చేయ‌వ‌చ్చు.

ధరలు ఇవే..

కొత్త మ్యాక్‌ మినీ, మ్యాక్‌ స్టూడియో మోడళ్లు బుధ‌వారం నుంచి యాపిల్‌ స్టోర్‌ రిటైల్‌ కేంద్రాలు, యాపిల్‌ అధీకృత విక్రేతలు, యాపిల్‌ ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఎం5 అల్ట్రాతో కూడిన 512 జీబీ యూనిఫైడ్‌ మెమరీ కాన్ఫిగరేషన్‌ ఉన్న మ్యాక్‌ స్టూడియో మాత్రం అక్టోబర్‌ చివరి వారంలో షిప్పింగ్‌ ప్రారంభమవుతుంది. మ్యాక్‌ మినీ ఎం6 మోడల్‌ ధర రూ.99,900 కాగా విద్యార్థులకు రూ.88,900కు లభిస్తుంది. మ్యాక్‌ మినీ ఎం5 ప్రొ ధర రూ.2,09,900, విద్యా సంస్థల ధర రూ.1,97,900గా ఉంది. మ్యాక్‌ స్టూడియో ఎం5 మ్యాక్స్‌ ధర రూ.2,79,900 కాగా విద్యా సంస్థల ధర రూ.2,56,900గా ఉంది. ఇక అత్యంత శక్తివంతమైన మ్యాక్‌ స్టూడియో ఎం5 అల్ట్రా ధర రూ.6,29,900 కాగా విద్యా సంస్థల ధర రూ.5,84,900గా ఉంది.

Advertisement
Advertisement