త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Price | బంగారం ధ‌ర‌ల‌కు భారీ బూస్ట్.. రూ.3 లక్షలు దాటే ఛాన్స్?

Gold Price | పసిడి ధరలు 10 గ్రాములకు రూ.1.50 ల‌క్ష‌ల స్థాయికి పైన కొనసాగుతున్నాయి. రూ.1,42,000, రూ.1,35,000 వద్ద బలమైన మద్దతు స్థాయిలు ఏర్పడ్డాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. త్వరలో పండుగల సీజన్‌ ప్రారంభం కానుండడంతో భౌతిక బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, ఇది దేశీయంగా బంగారం ధరలకు మరింత ఊతమిస్తుంద‌ని నిపుణులు అంచనా వేస్తున్నారు.

S

Business | Published On Sep 22, 2026, 5.18 pm IST

Gold Price | బంగారం ధ‌ర‌ల‌కు భారీ బూస్ట్.. రూ.3 లక్షలు దాటే ఛాన్స్?
Advertisement

Gold Price | పసిడి ధరలు 10 గ్రాములకు రూ.1.50 ల‌క్ష‌ల స్థాయికి పైన కొనసాగుతున్నాయి. రూ.1,42,000, రూ.1,35,000 వద్ద బలమైన మద్దతు స్థాయిలు ఏర్పడ్డాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. త్వరలో పండుగల సీజన్‌ ప్రారంభం కానుండడంతో భౌతిక బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, ఇది దేశీయంగా బంగారం ధరలకు మరింత ఊతమిస్తుంద‌ని నిపుణులు అంచనా వేస్తున్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, భౌతిక డిమాండ్, ముడిచమురు సరఫరాపై నెలకొన్న అనిశ్చితి కారణంగా ప్రపంచ వాణిజ్య మార్కెట్లలో పెరుగుతున్న ఆందోళనలు కూడా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలను పెంచే కీలక అంశాలుగా మారుతాయ‌ని వారు పేర్కొంటున్నారు. కాగా జెఫరీస్‌కు చెందిన ఆర్థిక విశ్లేషకుడు క్రిస్ వుడ్ బంగారం విషయంలో అత్యంత ఆశావహంగా ఉన్నారు. దీర్ఘకాలంలో బంగారం ధర ఔన్సుకు 10వేల అమెరికన్ డాలర్లకు చేరడం పూర్తిగా సాధ్యమేనని అభిప్రాయపడ్డారు.

10వేల డాల‌ర్ల‌కు సాధ్య‌మే..?

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఇప్పటికే కీలక స్థాయిల్లో ఉండగా, అంతర్జాతీయ పరిణామాలు అనుకూలిస్తే భవిష్యత్తులో మరింత భారీ పెరుగుదల కనిపించే అవకాశం ఉందని క్రిస్ వుడ్ అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలంలో బంగారం ధర ఔన్సుకు 10వేల డాలర్లకు ఎందుకు చేరుతుందని భావిస్తున్నారనే ప్రశ్నకు ఆయ‌న‌ సమాధానమిచ్చారు. అమెరికా, జపాన్ దేశాల ఆర్థిక పరిస్థితుల్లో తీవ్రమైన ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ఔన్సుకు 10వేల డాలర్ల స్థాయికి చేరడం సాధ్యమేనని అన్నారు. అమెరికా ట్రెజరీ బాండ్లపై వడ్డీ రాబడులు భారీగా పెరగడం ఆ దేశ రుణ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంద‌ని, దీంతో అమెరికా ప్రభుత్వం బాండ్ రాబడులను నియంత్రించడానికి లేదా ఒక పరిమితిలో ఉంచడానికి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంద‌ని అన్నారు.

అమెరికా డాల‌ర్ బ‌ల‌హీన‌ప‌డితే..

అమెరికా డాలర్ బలహీనపడితే ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలకు మద్దతు లభించే అవకాశం ఉందని క్రిస్ వుడ్ వివరించారు. అమెరికా ట్రెజరీ బాండ్ రాబడులను 5 శాతం నుంచి 6 శాతం మధ్యలో ఉంచేందుకు ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రయత్నిస్తున్నారనే సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఒకవేళ బాండ్ రాబడులను అలా నియంత్రించడం సాధ్యం కాకపోతే, అమెరికా ప్రభుత్వం నేరుగా ట్రెజరీ బాండ్ రాబడులను ఒక నిర్దిష్ట స్థాయిలో స్థిరీకరించే చర్యలకు వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రభుత్వం ట్రెజరీ బాండ్ రాబడులను నియంత్రించడం ప్రారంభిస్తే, వర్ధమాన మార్కెట్లలోని షేర్లతోపాటు బంగారానికి కూడా అది సానుకూల పరిణామంగా మారుతుందని క్రిస్ వుడ్ పేర్కొన్నారు.

రూ.3 ల‌క్ష‌ల‌కు పైన ఎలా వ‌స్తుంది..

ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,52,637గా ఉంది. గత ధరతో పోలిస్తే రూ.641 తగ్గి 0.42 శాతం క్షీణించింది. మరోవైపు వెండి ధర కిలోకు రూ.2,38,328గా ఉంది. వెండి ధర రూ.1,335 తగ్గి 0.56 శాతం క్షీణించింది. క్రిస్ వుడ్ అంచనా ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సుకు 10వేల డాలర్లకు చేరితే, భారత మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.3 లక్షల స్థాయిని దాటే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అమెరికా డాలర్‌తో భారత రూపాయి మారకం విలువ సుమారు రూ.96గా పరిగణిస్తే, ఔన్సుకు 10వేల డాలర్లు అంటే రూ.9.60 ల‌క్ష‌లు అవుతుంది. ఒక ఔన్సు బంగారం 28.3495 గ్రాములకు సమానం. ఈ లెక్కన రూ.9.60 ల‌క్ష‌ల‌ను 28.3495తో భాగించి, 10తో గుణిస్తే 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.3,38,630గా వస్తుంది. అంటే అంతర్జాతీయంగా బంగారం ఔన్సుకు 10వేల డాలర్ల స్థాయికి చేరితే, ప్రస్తుత మారకం విలువలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.3.38 లక్షల స్థాయికి చేరే అవకాశం ఉంటుందని ఈ అంచనా సూచిస్తోంది.

Advertisement
Advertisement