Stock Markets | భారీగా తగ్గిన ముడి చమురు ధరలు.. మార్కెట్లకు స్వల్ప ఊరట..
Stock Markets | దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు బుధవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిస్థితులు, ముడి చమురు ధరలు తగ్గడం దేశీయ ఈక్విటీ మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. అయితే విదేశీ పెట్టుబడిదారుల నిరంతర అమ్మకాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు లాభాలను పరిమితం చేశాయి.
Stock Markets | దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు బుధవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిస్థితులు, ముడి చమురు ధరలు తగ్గడం దేశీయ ఈక్విటీ మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. అయితే విదేశీ పెట్టుబడిదారుల నిరంతర అమ్మకాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు లాభాలను పరిమితం చేశాయి. ఉదయం 9:27 గంటలకు సెన్సెక్స్ 74,677.91 వద్ద ట్రేడైంది. మునుపటి ముగింపు 74,529.08తో పోలిస్తే 148.83 పాయింట్లు (0.20 శాతం) లాభపడింది. సెన్సెక్స్ 74,648.32 వద్ద ప్రారంభమైంది. మరోవైపు నిఫ్టీ 50 సూచీ 23,372.60 వద్ద కొనసాగింది. ఇది మునుపటి ముగింపుతో పోలిస్తే 43.60 పాయింట్లు (0.19 శాతం) పెరిగింది. నిఫ్టీ 23,352.15 వద్ద ప్రారంభమైంది. ముడి చమురు ధరలు 100 డాలర్ల దిగువకు పడిపోయినప్పటికీ మార్కెట్ ప్రారంభంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు మార్కెట్ సెంటిమెంట్‌పై ఒత్తిడిని కొనసాగిస్తున్నాయి.
తగ్గిన చమురు ధరలు..
ముడి చమురు ధరలు మరింత తగ్గడం భారత ఈక్విటీ మార్కెట్లకు కొంత ఊరటనిచ్చింది. మార్కెట్ అప్‌డేట్ సమయంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 98.18 డాలర్ల వద్ద ట్రేడవుతూ 1.08 శాతం తగ్గింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ 89.07 డాలర్ల వద్ద ఉండగా, 1.60 శాతం క్షీణించింది. చమురు ధరలు దీర్ఘకాలంగా తక్కువ స్థాయిలో కొనసాగితే భారత్‌లో ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే దేశ దిగుమతి బిల్లుపైనా భారం తగ్గుతుంది. అయితే భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఇప్పటికీ మార్కెట్‌కు ప్రతికూల అంశంగానే ఉంది.
సెంటిమెంట్ బలహీనంగానే..
జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వీకే విజయకుమార్ తెలిపిన ప్రకారం మార్కెట్ నిర్మాణం సాంకేతికంగా బలహీనంగా ఉండడంతో పాటు దిగువ వైపు మొగ్గు కనిపిస్తోందని తెలిపారు. ముడి చమురు ధరల్లో భారీ పతనం మార్కెట్ సెంటిమెంట్‌లో మార్పుకు ట్రిగ్గర్‌గా మారుతుందని పేర్కొన్నారు. అయితే బ్రెంట్ క్రూడ్ 99 డాలర్ల దిగువకు పడిపోయినప్పటికీ ఆ మార్పు ఈక్విటీల్లో ఇంకా కనిపించడం లేదని తెలిపారు. అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గడం కూడా మార్కెట్‌కు మరో సానుకూల సంకేతంగా మారుతుంని ఆయన పేర్కొన్నారు. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో అధిక ద్రవ్యోల్బణం కొనసాగుతున్న ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితుల్లో బాండ్ ఈల్డ్స్ గణనీయంగా తగ్గే అవకాశం తక్కువగా ఉందని తెలిపారు.
సంబంధిత వార్తలు

Stock Markets | చమురు ధరలు తగ్గినా.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
సెప్టెంబర్ 22, 2026

Crude Oil | రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు కోత..? అమెరికా ఆంక్షలతో భారత్‌పై ఒత్తిడి..
సెప్టెంబర్ 22, 2026

Stock Markets | పాజిటివ్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారుల్లో అప్రమత్తత..
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●Revanth Reddy | సీఎం గారు ప్రేక్షకులతో కలిసి ప్రీమియర్ షో చూస్తా.. అనుమతివ్వాలంటూ నాని రిక్వెస్ట్.. రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?
- ●College Student | ఢిల్లీలో మరో ఘటన.. కళాశాల విద్యార్థినిని వెంబడించి వేధించిన ఆకతాయిలు
- ●CRPF | సీఆర్పీఎఫ్లో 521 హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులు..
- ●MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?
- ●Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం
- ●Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Revanth Reddy | సీఎం గారు ప్రేక్షకులతో కలిసి ప్రీమియర్ షో చూస్తా.. అనుమతివ్వాలంటూ నాని రిక్వెస్ట్.. రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

College Student | ఢిల్లీలో మరో ఘటన.. కళాశాల విద్యార్థినిని వెంబడించి వేధించిన ఆకతాయిలు

CRPF | సీఆర్పీఎఫ్లో 521 హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులు..

MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?



