త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | ఫెడ్ రేట్ల పెంపు ఎఫెక్ట్‌.. బంగారం ధ‌ర‌ల‌పై ప్ర‌భావం..

Gold And Silver Prices Today | అమెరికా ఫెడ్ చాలా ఏళ్ల త‌రువాత వ‌డ్డీ రేట్ల‌ను పెంచ‌డంతో డాల‌ర్ బ‌ల‌ప‌డింది. దీని ప్ర‌భావం ఈక్విటీ మార్కెట్ల‌పైనా ప‌డింది. అంత‌ర్జాతీయంగా అనేక దేశాల ఈక్విటీ సూచీలు న‌ష్టాల్లో కొన‌సాగుతున్నాయి. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు మిశ్ర‌మ స్పంద‌న క‌న‌బ‌రుస్తున్నాయి. అయితే డాల‌ర్ బ‌ల‌ప‌డితే ఆటోమేటిగ్గా బంగారం ధ‌ర‌లు త‌గ్గుతాయి.

S

Business | Published On Sep 17, 2026, 11.11 am IST

Gold And Silver Prices Today | ఫెడ్ రేట్ల పెంపు ఎఫెక్ట్‌.. బంగారం ధ‌ర‌ల‌పై ప్ర‌భావం..
Advertisement

Gold And Silver Prices Today | అమెరికా ఫెడ్ చాలా ఏళ్ల త‌రువాత వ‌డ్డీ రేట్ల‌ను పెంచ‌డంతో డాల‌ర్ బ‌ల‌ప‌డింది. దీని ప్ర‌భావం ఈక్విటీ మార్కెట్ల‌పైనా ప‌డింది. అంత‌ర్జాతీయంగా అనేక దేశాల ఈక్విటీ సూచీలు న‌ష్టాల్లో కొన‌సాగుతున్నాయి. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు మిశ్ర‌మ స్పంద‌న క‌న‌బ‌రుస్తున్నాయి. అయితే డాల‌ర్ బ‌ల‌ప‌డితే ఆటోమేటిగ్గా బంగారం ధ‌ర‌లు త‌గ్గుతాయి. క‌నుక ఈ లోహాల ధ‌ర‌ల‌పై ప్ర‌భావం ప‌డ‌నుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. గురువారం సెష‌న్‌లో అంత‌ర్జాతీయంగా బంగారం ధ‌రలు లాభాల్లో ఉన్న‌ప్ప‌టికీ డాల‌ర్ బ‌ల‌ప‌డేకొద్దీ బంగారంపై ఒత్తిడి పెరుగుతుంద‌ని అంటున్నారు. ఇక ఈ సెష‌న్‌లో అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 0.64 శాతం మేర పెరిగి 4,291 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 0.96 శాతం పెరిగి 63 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1705 పాయింట్లు త‌గ్గి 1,50,790 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 2688 పాయింట్లు క్షీణించి 2,32,040 వ‌ద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు త‌గ్గ‌గా, వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,284 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,22, 272 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,52,840 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,28,400 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.6,000 త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,010 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,12,080గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,40,100 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,01,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.5,500 త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,463 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.91,704గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,14,630 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,46,300గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.4,500 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,45,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,450గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,50,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,500 గా ఉంది.

Advertisement
Advertisement