త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | యుద్దం ఎఫెక్ట్‌.. ఒక్క రోజులోనే రూ.26వేల‌కు పైగా త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌..

Gold And Silver Prices Today | అమెరికా, ఇరాన్‌ల మ‌ధ్య యుద్ధం తీవ్ర‌రూపం దాల్చ‌డంతో ఈక్విటీ మార్కెట్లు భారీ న‌ష్టాల్లో ట్రేడ‌వుతున్నాయి. విదేశీ, దేశీయ సూచీలు భారీగా గ్యాప్ డౌన్ అయ్యాయి. పెట్టుబ‌డిదారుల‌పై తీవ్ర అమ్మ‌కాల ఒత్తిడి నెల‌కొంది. ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డంతో ఆర్థిక వ్య‌వ‌స్థ‌, ద్ర‌వ్యోల్బ‌ణంపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌న్న ఆందోళ‌న‌లు కూడా పెరిగాయి.

S

Business | Published On Sep 11, 2026, 11.38 am IST

Gold And Silver Prices Today | యుద్దం ఎఫెక్ట్‌.. ఒక్క రోజులోనే రూ.26వేల‌కు పైగా త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌..
Advertisement

Gold And Silver Prices Today | అమెరికా, ఇరాన్‌ల మ‌ధ్య యుద్ధం తీవ్ర‌రూపం దాల్చ‌డంతో ఈక్విటీ మార్కెట్లు భారీ న‌ష్టాల్లో ట్రేడ‌వుతున్నాయి. విదేశీ, దేశీయ సూచీలు భారీగా గ్యాప్ డౌన్ అయ్యాయి. పెట్టుబ‌డిదారుల‌పై తీవ్ర అమ్మ‌కాల ఒత్తిడి నెల‌కొంది. ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డంతో ఆర్థిక వ్య‌వ‌స్థ‌, ద్ర‌వ్యోల్బ‌ణంపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌న్న ఆందోళ‌న‌లు కూడా పెరిగాయి. దీంతో పెట్టుబ‌డిదారులు అమ్మ‌కాల‌కు మొగ్గుచూపుతున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యాల్లో బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తుల వైపు ప్ర‌జ‌లు మొగ్గు చూపుతారు. కానీ ప్ర‌స్తుతం ఆయా లోహాల ధ‌ర‌లు కూడా భారీగా త‌గ్గుతున్నాయి. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర ఒక్క రోజులోనే రూ.26వేల‌కు పైగా త‌గ్గ‌గా, వెండి ధ‌ర కూడా రూ.10వేల‌కు పైగా త‌గ్గింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో మాత్రం మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తోంది. బులియ‌న్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 0.72 శాతం మేర పెరిగి 4,348 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 0.71 శాతం పెరిగి 64 డాల‌ర్ల‌కు చేరుకుంది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 54 పాయింట్లు పెరిగి 1,52,400 వ‌ద్ద నిల‌వ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 195 పాయింట్లు త‌గ్గి 2,33,904 వ‌ద్ద ఉంది.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,289 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,22, 312 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,52,890 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,28,900 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.26,200 త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,015 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,12,120గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,40,150 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,01,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.24,000 త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,467 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.91,736గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,14,670 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,46,700గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.19,600 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,45,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,450గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.10వేలు త‌గ్గింది. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,45,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,450 గా ఉంది.

Advertisement
Advertisement