త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Special Trains | వ‌రుస సెల‌వులు.. నేడు, రేపు సికింద్రాబాద్‌-కాగ‌జ్‌న‌గ‌ర్‌-హైద‌రాబాద్ మ‌ధ్య‌ ప్ర‌త్యేక రైళ్లు..

Special Trains | అస‌లే పండుగ సీజ‌న్. ఆపై వ‌రుస సెల‌వులు. హైద‌రాబాద్‌లో నివాసం ఉండేవారు పండుగ‌లు, వారాంతాల్లో సొంతూర్ల‌కు వెళ్తున్నారు. దీనిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని దక్షిణ మధ్య రైల్వే (SCR) నిర్ణ‌యించింది.

G

Telangana | Published On Sep 12, 2026, 8.21 am IST

Special Trains | వ‌రుస సెల‌వులు.. నేడు, రేపు సికింద్రాబాద్‌-కాగ‌జ్‌న‌గ‌ర్‌-హైద‌రాబాద్ మ‌ధ్య‌ ప్ర‌త్యేక రైళ్లు..
Advertisement

Special Trains | త్రినేత్ర‌.న్యూస్‌: అస‌లే పండుగ సీజ‌న్. ఆపై వ‌రుస సెల‌వులు. హైద‌రాబాద్‌లో నివాసం ఉండేవారు పండుగ‌లు, వారాంతాల్లో సొంతూర్ల‌కు వెళ్తున్నారు. దీనిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని దక్షిణ మధ్య రైల్వే (SCR) నిర్ణ‌యించింది. ప్ర‌యాణికుల ర‌ద్దీని నియంత్రించ‌డానికి, ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి ప్ర‌త్యేక రైళ్ల‌ను (Special Trains) న‌డుపనుంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ (Secunderabad)- సిర్పూర్ కాగజ్‌నగర్ (Sirpur Kaghaznagar)- హైదరాబాద్ (Hyderabad) మార్గంలో ప్రత్యేక అన్‌రిజర్వ్‌డ్ జనసాధారణ్ ఎక్స్‌ప్రెస్ (Jan Sadharan Express) రైళ్లను నడుపుతున్న‌ది. ఈ ప్రత్యేక రైళ్ల సేవలు శ‌ని, ఆదివారాల్లో (సెప్టెంబర్ 12, 13) అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్ల‌లో ప్ర‌యాణించాలంటే ఎలాంటి ముందస్తు రిజర్వేషన్ అవసరం లేదు. వీటిలో సాధారణ బోగీలు మాత్రమే ఉంటాయి. ఈ రైల్లు సాధార‌ణ ప్ర‌యాణికుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌నున్నాయి. పండుగలకు సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ (రైలు నంబర్‌ 07235): శ‌ని, ఆదివారాల్లో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరి, అదే రోజు సాయంత్రం 17.30 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది. ఈ రైళ్లు చర్లపల్లి, భువనగిరి, జనగామ‌, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రోడ్ స్టేష‌న్ల‌లో ఆగుతాయి.

సికింద్రాబాద్‌- మ‌ధ్యాహ్నం 12.10 గంట‌ల‌కు బ‌య‌ల్దేరుతుంది..
చర్లపల్లి- మధ్యాహ్నం 12.30 / 12.32
భువనగిరి- మధ్యాహ్నం 12.59 / 13.00
జనగామ‌- మధ్యాహ్నం 13.29 / 13.30
కాజీపేట- మధ్యాహ్నం 14.23 / 14.25
జమ్మికుంట- మధ్యాహ్నం 15.00 / 15.01
పెద్దపల్లి- మధ్యాహ్నం 15.30 / 15.31
రామగుండం- మధ్యాహ్నం 15.49 / 15.50
మంచిర్యాల- సాయంత్రం 16.11 / 16.12
బెల్లంపల్లి- సాయంత్రం 16.30 / 16.31
ఆసిఫాబాద్ రోడ్- సాయంత్రం 16.45 / 16.46
సిర్పూర్ కాగజ్‌నగర్- సాయంత్రం 17.30 గంటలకు చేరుకుంటుంది.

సిర్పూర్ కాగజ్‌నగర్ - హైదరాబాద్ (రైలు నంబర్‌ 07236): తిరుగు ప్రయాణంలో ఈ రైలు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి సాయంత్రం 18.00 గంటలకు బయలుదేరి, రాత్రి 23.15 గంటలకు హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్‌కు చేరుకుంటుంది.

ఆసిఫాబాద్ రోడ్- సాయంత్రం 18.14 / 18.15
బెల్లంపల్లి- సాయంత్రం 18.35 / 18.36
మంచిర్యాల- రాత్రి 18.56 / 18.57
రామగుండం- రాత్రి 19.10 / 19.11
పెద్దపల్లి- రాత్రి 19.30 / 19.31
జమ్మికుంట- రాత్రి 20.00 / 20.01
కాజీపేట- రాత్రి 20.33 / 20.35
జనగాం- రాత్రి 21.19 / 21.20
భువనగిరి- రాత్రి 21.54 / 21.55
చర్లపల్లి- రాత్రి 22.23 / 22.25
సికింద్రాబాద్- రాత్రి 22.45 / 22.50
హైదరాబాద్ (నాంపల్లి)- రాత్రి 23.15 గంటలకు చేరుకుంటుంది.

Advertisement
Advertisement