త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rain Alert | రెండు రోజులు విస్తారంగా వ‌ర్షాలు.. ప‌లు జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్‌

Rain Alert | బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడన ప్ర‌భావంతో రెండు రోజుల‌పాటు రాష్ట్రంలో విస్తారంగా వ‌ర్షాలు (Rain Alert) కురుస్తాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం (IMD Hyderabad) వెల్ల‌డించింది.

G

Telangana | Published On Sep 12, 2026, 9.33 am IST

Rain Alert | రెండు రోజులు విస్తారంగా వ‌ర్షాలు.. ప‌లు జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్‌
Advertisement

Rain Alert | త్రినేత్ర‌.న్యూస్‌: బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడన ప్ర‌భావంతో రెండు రోజుల‌పాటు రాష్ట్రంలో విస్తారంగా వ‌ర్షాలు (Rain Alert) కురుస్తాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం (IMD Hyderabad) వెల్ల‌డించింది. శ‌ని, ఆదివారాల్లో తూర్పు, ఉత్త‌ర తెలంగాణ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపుల‌తో పాటు గంట‌కు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయ‌ని పేర్కొంది. శనివారం తెల్లవారుజాము నుంచే హైద‌రాబాద్‌తోపాటు (Hyderabad) ప‌లు జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వ‌ర్షాలు కురుస్తున్నాయి.

హనుమకొండ, వరంగల్, జనగామ ప్రాంతాల్లో ఇప్పటికే మోస్తరు వాన ప‌డుతుండ‌గా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, హైద‌రాబాద్‌, జ‌గిత్యాల‌, కామారెడ్డి, క‌రీంన‌గ‌ర్‌, మేడ్చ‌ల్‌, మ‌హ‌బూబాబాద్‌, మంచిర్యాల‌, నాగ‌ర్‌క‌ర్రూల్‌, న‌ల్ల‌గొండ‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, సిరిసిల్ల‌, రంగారెడ్డి, సిద్దిపేట‌, సూర్యాపేట, యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాల్లో ఉరుములతో కూడిన వ‌ర్షం కురుస్తుంద‌ని వెల్ల‌డించింది. ఆయా జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్ జారీచేసింది.

ఇక హైద‌రాబాద్‌లో ఆకాశం మేఘావృత‌మై ఉంటుంద‌ని తెలిపింది. న‌గ‌రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలిక‌పాటి వ‌ర్షం లేదా ఉరుముల‌తో కూడిన జ‌ల్లులు కురిసే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించింది. గ‌రిష్టంగా 32 డిగ్రీలు, క‌నిష్టంగా 25 డిగ్రీల వ‌ర‌కు ఉష్ణోగ్ర‌త‌లు ఉంటాయని చెప్పింది.

 

Advertisement
Advertisement