త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్‌.. స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు..

Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అనుకూల సంకేతాలు రావ‌డంతో ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడ‌వుతున్నాయి. అయితే పెట్టుబ‌డిదారులు మాత్రం బంగారం, వెండి వైపు మొగ్గు చూప‌డం లేదు. ఆయా లోహాల ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. మంగ‌ళ‌వారం అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్‌ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర 0.43 శాతం త‌గ్గి 4,122 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 0.90 శాతం త‌గ్గి 60 డాల‌ర్ల‌కు వ‌చ్చింది.

S

Business | Published On Oct 6, 2026, 11.20 am IST

Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్‌.. స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు..
Advertisement

Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అనుకూల సంకేతాలు రావ‌డంతో ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడ‌వుతున్నాయి. అయితే పెట్టుబ‌డిదారులు మాత్రం బంగారం, వెండి వైపు మొగ్గు చూప‌డం లేదు. ఆయా లోహాల ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. మంగ‌ళ‌వారం అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్‌ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర 0.43 శాతం త‌గ్గి 4,122 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 0.90 శాతం త‌గ్గి 60 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 210 పాయింట్లు త‌గ్గి 1,49,106 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 994 పాయింట్లు త‌గ్గి 2,25,093 వ‌ద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గగా, వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,902 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,19,216 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,49,020 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,90,200 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.1,600 త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,660 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,09,280గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,36,600 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,66,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,500 త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,177 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.89,416గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,11,770 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,17,700గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,200 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,35,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,350గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,45,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,450 గా ఉంది.

Advertisement
Advertisement