Traffic Restrictions | హైదరాబాద్‌లో ఈ నెల 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్‌లో వెళ్లారో ఇక అంతే..!
Traffic Restrictions | హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉన్న వైశాలి నగర్ ప్రాంతంలో (Traffic Restrictions) మరో వారం రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలను పొడిగించారు.
Traffic Restrictions | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉన్న వైశాలి నగర్ ప్రాంతంలో (Traffic Restrictions) మరో వారం రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలను పొడిగించారు. రైల్వే అండర్‌పాస్‌లో (Railway Underpass) కొత్తగా వేసిన రోడ్డు ఉపరితలం గట్టిపడేందుకు (Drain Works) వీలుగా అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో అక్టోబర్ 8 (గురువారం) నుంచి ఈ నెల 14 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. దీంతో వైశాలి నగర్ రైల్వే అండర్‌పాస్ పరిసరాల్లోని పలు మార్గాలు, కూడళ్లపై ప్రభావం పడనుంది.
వాహనాల దారి మళ్లింపు ఇలా..
- మై హోమ్ మంగళ అపార్ట్‌మెంట్స్ నుంచి అండర్‌పాస్ ద్వారా హఫీజ్‌పేట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను మై హోమ్ మంగళ టీ-జంక్షన్ వద్ద మళ్లిస్తారు. ఆ తర్వాత రాఘవేంద్ర నగర్ కాలనీ వైపు యూ-టర్న్, రాఘవేంద్ర నగర్ కాలనీ జంక్షన్ వద్ద ఎడమ మలుపు, హై-టెన్షన్ రోడ్, కొండాపూర్‌లోని ఆర్‌టీఏ కార్యాలయం వద్ద ఎడమ మలుపు తీసుకుని, హఫీజ్‌పేట్ ఆర్‌ఓబీ మీదుగా హఫీజ్‌పేట్‌కు వెళ్లవచ్చు.
- తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ నుంచి వైశాలి నగర్ రైల్వే అండర్‌పాస్ వైపు వచ్చే వాహనాలు మైహోమ్ మంగళ టి-జంక్షన్ వద్ద మళ్లిస్తారు. వాహనదారులు రాఘవేంద్ర నగర్ కాలనీ వైపు వెళ్లి, కాలనీ జంక్షన్ వద్ద ఎడమవైపుకు తిరిగి, హై-టెన్షన్ రోడ్డు, కొండాపూర్‌లోని ఆర్‌టీఏ కార్యాలయం వద్ద ఎడమవైపుకు తిరిగి, ఆ తర్వాత హఫీజ్‌పేట్ ఆర్‌ఓబీ మీదుగా హఫీజ్‌పేట్, ఆల్విన్ జంక్షన్ వైపు వెళ్లాలి.
- మై హోమ్ జ్యువెల్ వెనక గేటు, ఆర్‌టీసీ కాలనీ, మంజీర పైప్‌లైన్ రోడ్డు నుంచి అండర్‌పాస్ ద్వారా మై హోమ్ మంగళ, రాఘవేంద్ర నగర్ కాలనీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను, పైప్‌లైన్ రోడ్డు వెంబడి హఫీజ్‌పేట్ ఆర్‌ఓబి వైపు వెళ్లాలి. జెన్‌ప్యాక్ట్ సమీపంలో ఎడమవైపునకు తిరిగి, కొండాపూర్-ఆల్విన్ జంక్షన్ రోడ్డులోకి ప్రవేశించి, ప్రభుత్వ పాఠశాల వద్ద యూ-టర్న్ తీసుకుని, హఫీజ్‌పేట్ ఆర్‌ఓబి మీదుగా కొండాపూర్, రాఘవేంద్ర నగర్ కాలనీ వైపు వెళ్లాలి.
- వాసవి లేక్ సిటీ, హఫీజ్‌పేట్ లేక్ నుంచి అండర్‌పాస్ ద్వారా మై హోమ్ మంగళ, రాఘవేంద్ర నగర్ కాలనీ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను స్పైర్ వన్ అపార్ట్‌మెంట్స్ వద్ద దారిమళ్లిస్తారు. ప్రయాణికులు హఫీజ్‌పేట్ ఆర్‌ఓబి వైపు యూ-టర్న్ తీసుకుని, జెన్‌ప్యాక్ట్ సమీపంలో ఎడమవైపుకు తిరిగి, కొండాపూర్-ఆల్విన్ జంక్షన్ రోడ్డులోకి ప్రవేశించి, ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్న యూ-టర్న్ తీసుకున్న తర్వాతే హఫీజ్‌పేట్ ఆర్‌ఓబి మీదుగా వెళ్లాలి.
- గోపాల్ నగర్, కాల్వరి టెంపుల్ నుంచి మై హోమ్ మంగళ వైపు వెళ్లే వాహనదారులు హఫీజ్‌పేట్ ఆర్‌ఓబి వద్ద కుడివైపునకు తిరిగి, కొండాపూర్-ఆల్విన్ జంక్షన్ రోడ్డులోకి ప్రవేశించి, ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్న యూ-టర్న్ తీసుకున్న తర్వాతే హఫీజ్‌పేట్ ఆర్‌ఓబి మీదుగా కొండాపూర్, రాఘవేంద్ర నగర్ కాలనీ వైపు వెళ్లవచ్చు.
ట్రాఫిక్ ఆంక్షలకు అనుగుణంగా వాహణదారులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
సంబంధిత వార్తలు

Traffic Restrictions | హైదరాబాద్‌లో కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదు
సెప్టెంబర్ 26, 2026

Ganesh Immersion | ఎల్లుండి ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు.. 10 వేల కెమెరాలతో నిఘా
సెప్టెంబర్ 23, 2026

Traffic Restrictions | గణేశ్ నిమజ్జనం.. కూకట్‌పల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●TGSRTC | భారీగా తగ్గిన ఏసీ బస్సు చార్జీలు.. నేటి నుంచే అమల్లోకి
- ●Naval Dockyard | నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్లో 283 ఖాళీలు
- ●Horoscope | అక్టోబర్ 7 రాశిఫలాలు.. విదేశీ వ్యవహారాలలో ఆకస్మిక మార్పులు!
- ●Revanth Reddy Slams BJP | రాహుల్ పోరాటానికి కేంద్రం గజగజ.. సీఈసీ రాజీనామా చేసేవరకు విశ్రమించం
- ●Captain Smit Machchhar | 174 మందిని కాపాడిన భారత పైలట్‌కు అమెరికా చట్టసభ సలాం
- ●Future City Police Commissionerate | ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధి ఖరారు: ఇబ్రహీంపట్నం డివిజన్‌లోకి అబ్దుల్లాపూర్ మెట్

TGSRTC | భారీగా తగ్గిన ఏసీ బస్సు చార్జీలు.. నేటి నుంచే అమల్లోకి

Naval Dockyard | నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్లో 283 ఖాళీలు

Horoscope | అక్టోబర్ 7 రాశిఫలాలు.. విదేశీ వ్యవహారాలలో ఆకస్మిక మార్పులు!

Revanth Reddy Slams BJP | రాహుల్ పోరాటానికి కేంద్రం గజగజ.. సీఈసీ రాజీనామా చేసేవరకు విశ్రమించం



