త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGSRTC | భారీగా త‌గ్గిన ఏసీ బ‌స్సు చార్జీలు.. నేటి నుంచే అమ‌ల్లోకి

TGSRTC | శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. హైద‌రాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్ట్‌కు (Shamshabad Airport) నడిచే ఏసీ పుష్పక్ బస్సు (Pushpak Bus) చార్జీలను 40 శాతం తగ్గించింది.

G

Telangana | Published On Oct 7, 2026, 6.45 am IST

TGSRTC | భారీగా త‌గ్గిన ఏసీ బ‌స్సు చార్జీలు.. నేటి నుంచే అమ‌ల్లోకి
Advertisement

TGSRTC | త్రినేత్ర న్యూస్‌: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. హైద‌రాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్ట్‌కు (Shamshabad Airport) నడిచే ఏసీ పుష్పక్ బస్సు (Pushpak Bus) చార్జీలను 40 శాతం తగ్గించింది. త‌గ్గిన ధ‌ర‌లు బుధ‌వారం (అక్టోబ‌ర్ 7 నుంచి) అమ‌ల్లోకి రానున్నాయి. దీంతో ప్రయాణికులకు ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో చార్జీలు (Bus Fare) త‌గ్గించామ‌ని ఆర్టీసీ అధికారులు వెల్ల‌డించారు. ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. త‌గ్గిన టికెట్ ధ‌రల‌తో ట్యాక్సీలు, క్యాబుల్లో వెళ్లేవారికి భారీ ఊర‌ట ల‌భించ‌నుంది. సాధార‌ణంగా క్యాబ్‌, ట్యాక్సీ బుక్ చేసుకుంటే సుమారు రూ.1000 కంటే అధికంగానే చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీసీ తాజా నిర్ణ‌యంతో అత్యంత సౌకర్యవంతమైన ఏసీ పుష్పక్ బస్సుల్లో చాలా తక్కువ ధరలోనే సురక్షితంగా విమానాశ్రయానికి, ఎయిర్‌పోర్టు నుంచి గ‌మ్య‌స్థానాల‌కు చేరుకునే అవ‌కాశం లభించింది.

సగానికి పైగా తగ్గిన టికెట్‌ భారం

సవరించిన ధరల ప్రకారం, నగరంలోని ప్రధాన మార్గాల్లో ప్రయాణించే వారికి భారీ ఉపశమనం లభించిన‌ట్ల‌యింది. మియాపూర్ ఎక్స్‌రోడ్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు ఇప్పటివరకు ఉన్న రూ.350 చార్జీని రూ.250కి తగ్గింది. ఇక‌ జేఎన్‌టీయూ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు రూ.350గా ఉన్న టికెట్ ధ‌ర‌ రూ.200కి, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే గచ్చిబౌలి నుంచి ఎయిర్‌పోర్ట్ మార్గంలో చార్జీని రూ.300 నుంచి ఏకంగా రూ. 150కి తగ్గించింది.

అలాగే సికింద్రాబాద్ పరిధిలోని జూబ్లీ బస్ స్టేషన్ (JBS) నుంచి ఎయిర్‌పోర్ట్‌కు రూ.350గా ఉన్న చార్జీ ఇకపై రూ.200, లింగంపల్లి, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌, ఓఆర్ఆర్‌, ఆల్విన్ ఎక్స్‌‌రోడ్, కొండాపూర్ వంటి ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి వెళ్లే పుష్పక్ బస్సు చార్జీలు రూ.150 నుంచి రూ.200 వరకు త‌గ్గింది.

Advertisement
Advertisement