త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | బంగారం కొనేవారికి అల‌ర్ట్‌.. బులియ‌న్ మార్కెట్ల‌లో తీవ్ర అస్థిర‌త‌..

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో నెల‌కొన్న ప‌రిణామాల నేప‌థ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర అస్థిర‌త‌తో కొన‌సాగుతుండ‌గా, బులియ‌న్ మార్కెట్లలోనూ అదేలాంటి ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. మంగ‌ళ‌వారం ర్యాలీ వ‌చ్చిన‌ప్ప‌టికీ బుధ‌వారం ప‌రిణామాలు మారిపోవ‌డంతో మార్కెట్లు అస్థిరంగా క‌దులుతున్నాయి.

S

Business | Published On Oct 21, 2026, 11.11 am IST

Gold And Silver Prices Today | బంగారం కొనేవారికి అల‌ర్ట్‌.. బులియ‌న్ మార్కెట్ల‌లో తీవ్ర అస్థిర‌త‌..
Advertisement

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో నెల‌కొన్న ప‌రిణామాల నేప‌థ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర అస్థిర‌త‌తో కొన‌సాగుతుండ‌గా, బులియ‌న్ మార్కెట్లలోనూ అదేలాంటి ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. మంగ‌ళ‌వారం ర్యాలీ వ‌చ్చిన‌ప్ప‌టికీ బుధ‌వారం ప‌రిణామాలు మారిపోవ‌డంతో మార్కెట్లు అస్థిరంగా క‌దులుతున్నాయి. అందువ‌ల్ల బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తుల్లో పెట్టుబ‌డులు పెట్ట‌ద‌ల‌చిన వారు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో బుధవారం ఔన్స్ బంగారం ధ‌ర 0.07 శాతం పెరిగి 4,127 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 0.67 శాతం త‌గ్గి 57 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 419 పాయింట్లు త‌గ్గి 1,46,100 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1585 పాయింట్లు ప‌త‌న‌మై 2,09,929 వ‌ద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో గ‌త సెష‌న్‌తో పోలిస్తే బంగారం, వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,608 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,16,864 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,46,080 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,60,800 గా ఉంది. కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే ఈ ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,390 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,07,120గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,33,900 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,39,000గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ ధ‌ర‌లోనూ మార్పు లేదు.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.10,956 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.87,648గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,09,560 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.10,95,600గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ ధ‌ర‌లోనూ మార్పు లేదు.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,30,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,300గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,30,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,300 గా ఉంది.

Advertisement
Advertisement