Road Accident | వాకింగ్‌కు వెళ్లిన ముగ్గురిని ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరు దుర్మరణం
Road Accident | సూర్యాపేట (Suryapet) సమీపంలోని బాలెంల స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వాకింగ్‌కు వెళ్లిన (Morning Walk) ముగ్గురిని డీసీఎం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
Road Accident | త్రినేత్ర న్యూస్: సూర్యాపేట (Suryapet) సమీపంలోని బాలెంల స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వాకింగ్‌కు వెళ్లిన (Morning Walk) ముగ్గురిని డీసీఎం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
గుర్రం సైదులు, ఆలకుంట్ల నాగరాజు, గొల్ల జానయ్య రోజూలానే శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో బాలెంల స్టేజీ సమీపానికి చేరుకోగానే.. జనగామ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న డీసీఎం (DCM) వారిని ఢీకొట్టింది. దీంతో గుర్రం సైదులు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన నాగరాజు, జానయ్యను స్థానికులు సూర్యాపేట దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ నాగరాజు మరణించారు. తలకు బలమైన గాయం కావడంతో జానయ్యకు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కాగా, యాక్సిడెంట్ అనంతరం ఆగకుండా డీసీఎం డ్రైవర్ వెళ్లిపోగా.. అతడిని మిర్యాలగూడలో (Miryalaguda) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Stock Markets | భారీ లాభాల తర్వాత మార్కెట్లకు బ్రేక్.. స్వల్ప నష్టాల్లో సూచీలు..
- ●Manne Krishank | ఒకటి కాదు.. మూడు ఆధారాలు చూపిస్తం.. చర్చకు సిద్ధమా?: రేవంత్ రెడ్డికి మన్నె క్రిశాంక్ సవాల్
- ●All Party Meeting | నేడు జరగాల్సిన అఖిలపక్ష సమావేశం వాయిదా
- ●Basara Temple | బాసరలో మూల నక్షత్ర వేడుకలు.. భారీగా తరలివచ్చిన భక్తులు
- ●Abhijeet Dipke | నాపై ఐబీ నిఘా.. నన్ను ఏదైనా చేయొచ్చు: అభిజీత్ దీప్కే
- ●Oregon School Shooting | స్కూల్లో టీనేజర్ కాల్పులు.. ముగ్గురు చిన్నారులు సహా నలుగురు మృతి

Stock Markets | భారీ లాభాల తర్వాత మార్కెట్లకు బ్రేక్.. స్వల్ప నష్టాల్లో సూచీలు..

Manne Krishank | ఒకటి కాదు.. మూడు ఆధారాలు చూపిస్తం.. చర్చకు సిద్ధమా?: రేవంత్ రెడ్డికి మన్నె క్రిశాంక్ సవాల్

All Party Meeting | నేడు జరగాల్సిన అఖిలపక్ష సమావేశం వాయిదా

Basara Temple | బాసరలో మూల నక్షత్ర వేడుకలు.. భారీగా తరలివచ్చిన భక్తులు






