త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manne Krishank | ఒకటి కాదు.. మూడు ఆధారాలు చూపిస్తం.. చర్చకు సిద్ధమా?: రేవంత్ రెడ్డికి మ‌న్నె క్రిశాంక్ స‌వాల్‌

Manne Krishank | మెడికవర్ హాస్పిట‌ల్‌ వ్యవహారంపై సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని బీఆర్‌ఎస్‌ నాయకుడు మన్నె క్రిశాంక్‌ (Manne Krishank) విమర్శించారు. మెడికవర్‌, మాక్స్‌బీఎన్‌ ఫార్మా, మైండ్‌ వాల్ట్‌ సంస్థల్లో రేవంత్‌ రెడ్డి కుటుంబానికి సన్నిహితులుగా పేర్కొంటున్న వ్యక్తులకు డైరెక్టర్‌గా ఉన్న షేర్ల వివరాలను వెల్లడించారు

G

Telangana | Published On Oct 16, 2026, 9.58 am IST

Manne Krishank | ఒకటి కాదు.. మూడు ఆధారాలు చూపిస్తం.. చర్చకు సిద్ధమా?: రేవంత్ రెడ్డికి మ‌న్నె క్రిశాంక్ స‌వాల్‌
Advertisement

Manne Krishank | త్రినేత్ర న్యూస్‌: మెడికవర్ హాస్పిట‌ల్‌ వ్యవహారంపై సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని బీఆర్‌ఎస్‌ నాయకుడు మన్నె క్రిశాంక్‌ (Manne Krishank) విమర్శించారు. మెడికవర్‌, మాక్స్‌బీఎన్‌ ఫార్మా, మైండ్‌ వాల్ట్‌ సంస్థల్లో రేవంత్‌ రెడ్డి కుటుంబానికి సన్నిహితులుగా పేర్కొంటున్న వ్యక్తులకు డైరెక్టర్‌గా ఉన్న షేర్ల వివరాలను వెల్లడించారు.

అన్నం శరత్‌ రెడ్డి: మెడికవర్‌ ఆసుపత్రిలో 5,08,808 షేర్లు; మాక్స్‌బీఎన్‌ ఫార్మాలో 1,08,000 షేర్లు. ఈ సంస్థను రేవంత్‌ రెడ్డి అల్లుడికి సంబంధించిన సంస్థగా ఆయన పేర్కొన్నారు.


బ్రహ్మానంద రెడ్డి: మెడికవర్‌ ఆసుపత్రిలో 28,78,192 షేర్లు; మైండ్‌ వాల్ట్‌లో 65,834 షేర్లు. మైండ్‌ వాల్ట్‌ రేవంత్‌ రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డికి సంబంధించిన కార్పొరేట్‌ పాఠశాలల సంస్థ.

దుంప శిరీష రెడ్డి: మెడికవర్‌ ఆసుపత్రిలో 46,46,596 షేర్లు; మాక్స్‌బీఎన్‌ ఫార్మాలో 37,00,000 షేర్లు; మైండ్‌ వాల్ట్‌లో 1,97,500 షేర్లు.

అన్నం శ‌ర‌త్ రెడ్డి, బ్ర‌హ్మానంద రెడ్డి, దుంప శిరీష రెడ్డికి మెడికవర్‌, మాక్స్‌బీఎన్‌ ఫార్మా, మైండ్‌ వాల్ట్‌ సంస్థల్లో షేర్లు ఉన్నాయని వివరాలు చెబుతున్నాయి. ఈ సంబంధాలపై ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి. చర్చకు సిద్ధమైతే, ఆధారాలతో మాట్లాడేందుకు మేము సిద్ధంగా ఉన్నామ‌ని క్రిశాంక్ స్ప‌ష్టం చేశారు.

మెడికవర్‌ ఆసుపత్రి రూ.13,200 కోట్లకు అమ్ముడైన వ్యవహారంపైనా ముఖ్య‌మంత్రి స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. `ఈ లావాదేవీపై ఉన్న సందేహాలకు సమాధానం చెప్పాలి. రైతులు కష్టాల్లో ఉన్న ఈ సమయంలో, ఆ మొత్తాన్ని రూ.13,200 కోట్లు రైతులకు పంచిపెట్టే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా?” అని ప్రశ్నించారు.

Advertisement
Advertisement