త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.10వేలు త‌గ్గిన బంగారం ధ‌ర‌.. మార్కెట్ల‌లో అనిశ్చితి..

Gold And Silver Prices Today | ప్ర‌పంచ ఈక్విటీ మార్కెట్లు బుధ‌వారం మిశ్ర‌మ ధోర‌ణిలో క‌దులుతుండ‌డంతో సూచీల్లో అనిశ్చితి నెల‌కొంది. ప‌శ్చిమ ఆసియాలో ఉద్రిక్త ప‌రిస్థితులు కాస్త త‌గ్గిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ సౌదీ అరేబియాపై హౌతీలు దాడులు చేస్తుండ‌డం, అధిక స్థాయిల్లో ఉన్న చ‌మురు ధ‌ర‌లు వంటి కార‌ణాలు పెట్టుబ‌డిదారుల్లో ఆందోళ‌న‌ల‌ను పెంచుతున్నాయి.

S

Business | Published On Oct 14, 2026, 11.15 am IST

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.10వేలు త‌గ్గిన బంగారం ధ‌ర‌.. మార్కెట్ల‌లో అనిశ్చితి..
Advertisement

Gold And Silver Prices Today | ప్ర‌పంచ ఈక్విటీ మార్కెట్లు బుధ‌వారం మిశ్ర‌మ ధోర‌ణిలో క‌దులుతుండ‌డంతో సూచీల్లో అనిశ్చితి నెల‌కొంది. ప‌శ్చిమ ఆసియాలో ఉద్రిక్త ప‌రిస్థితులు కాస్త త‌గ్గిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ సౌదీ అరేబియాపై హౌతీలు దాడులు చేస్తుండ‌డం, అధిక స్థాయిల్లో ఉన్న చ‌మురు ధ‌ర‌లు వంటి కార‌ణాలు పెట్టుబ‌డిదారుల్లో ఆందోళ‌న‌ల‌ను పెంచుతున్నాయి. దీంతో మార్కెట్లు అనిశ్చిత ధోర‌ణిలో ఉన్నాయి. బులియ‌న్ మార్కెట్ల‌లోనూ అదేలాంటి ధోర‌ణి క‌నిపిస్తోంది. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్‌ల‌లో బుధ‌వారం ఔన్స్ బంగారం ధ‌ర 0.05 శాతం మేర స్వ‌ల్పంగా త‌గ్గి 4,157 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 0.10 శాతం త‌గ్గి 59 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 474 పాయింట్లు త‌గ్గి 1,47,976కు చేర‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1010 పాయింట్లు త‌గ్గి 2,18,207కు చేరింది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గ‌గా, వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,826 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,18,608 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,48,260 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,82,600 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.10,300 త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,590 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,08,720గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,35,900 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,59,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.9,500 త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,119 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.88,952గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,11,190 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,11,900గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.7,800 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,35,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,350గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,45,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,450 గా ఉంది.

Advertisement
Advertisement