త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్ల‌లో కొన‌సాగుతున్న అస్థిర‌త‌.. పెట్టుబ‌డి పెట్టాలా, వేచి చూడాలా..?

Gold And Silver Prices Today | ర‌ష్యా నుంచి డీజ‌ల్ స‌ర‌ఫ‌రా చేసుకుంటున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో స్టాక్ మార్కెట్ల‌కు ఊతం లభించింది. దీంతో చ‌మురు ధ‌ర‌లు భారీగా ప‌త‌న‌మ‌వ్వ‌గా గ్లోబ‌ల్ మార్కెట్లు పాజిటివ్‌గా కొన‌సాగుతున్నాయి. దేశీయ ఈక్విటీ సూచీలు సైతం లాభాల్లో ఉన్నాయి. అయితే డాల‌ర్ బ‌ల‌హీన‌ప‌డ‌డంతో స‌హ‌జంగానే బులియ‌న్ ఆస్తుల ధ‌ర‌లు పెరుగుతాయి.

S

Business | Published On Oct 12, 2026, 11.22 am IST

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్ల‌లో కొన‌సాగుతున్న అస్థిర‌త‌.. పెట్టుబ‌డి పెట్టాలా, వేచి చూడాలా..?
Advertisement

Gold And Silver Prices Today | ర‌ష్యా నుంచి డీజ‌ల్ స‌ర‌ఫ‌రా చేసుకుంటున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో స్టాక్ మార్కెట్ల‌కు ఊతం లభించింది. దీంతో చ‌మురు ధ‌ర‌లు భారీగా ప‌త‌న‌మ‌వ్వ‌గా గ్లోబ‌ల్ మార్కెట్లు పాజిటివ్‌గా కొన‌సాగుతున్నాయి. దేశీయ ఈక్విటీ సూచీలు సైతం లాభాల్లో ఉన్నాయి. అయితే డాల‌ర్ బ‌ల‌హీన‌ప‌డ‌డంతో స‌హ‌జంగానే బులియ‌న్ ఆస్తుల ధ‌ర‌లు పెరుగుతాయి. కానీ ప్ర‌స్తుతం వాటి ధ‌ర‌ల్లో అనిశ్చితి కొన‌సాగుతోంది. పెట్టుబ‌డిదారులు పెట్టుబ‌డులు పెట్టేందుకు సంకోచిస్తున్నారు. అయితే దీన్ని అవ‌కాశంగా కాకుండా వేచి ఉండే స‌మ‌యంగా చూడాల‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇక అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర సోమ‌వారం 0.22 శాతం త‌గ్గి 4,186 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 0.08 శాతం పెరిగి 60 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1251 పాయింట్లు త‌గ్గి 1,50,248కు రాగా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1071 పాయింట్లు త‌గ్గి 2,24,684కు చేరింది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు కాస్త త‌గ్గగా, వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,098 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,20,784 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,50,980 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,09,800 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.4,400 త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,840 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,10,720గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,38,400 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,84,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.4,000 త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,324 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.90,592గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,13,240 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,32,400గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3,300 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,40,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,400గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,45,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,450 గా ఉంది.

Advertisement
Advertisement