Property Dispute | ఆస్తి కోసం గొడవ.. మూడు రోజులపాటు ఇంట్లోనే మృతదేహం
Property Dispute | మానవ సంబంధాలు రానురాను ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. ఆస్తికోసం (Property Dispute) మానవత్వాన్నే మరచిపోతున్నారు. కుటుంబ పెద్ద చనిపోతే బాధ పడాల్సిన కుటుంబ సభ్యులు ఆస్తి పంపకాల కోసం గొడవకు దిగారు.
Property Dispute | త్రినేత్ర న్యూస్: మానవ సంబంధాలు రానురాను ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. ఆస్తికోసం (Property Dispute) మానవత్వాన్నే మరచిపోతున్నారు. కుటుంబ పెద్ద చనిపోతే బాధ పడాల్సిన కుటుంబ సభ్యులు ఆస్తి పంపకాల కోసం గొడవకు దిగారు. దీంతో అంత్యక్రియలు (Funeral) చేయకపోవడంతో మృతదేహం (Dead Body) మూడు రోజులపాటు ఇంట్లోనే ఉండిపోయింది. గ్రామ పెద్దలు చొరవ చూపినా కుటుంబ సభ్యులు వినకపోవడంతో పోలీసులు జోక్యం చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో (Vemulawada) చోటుచేసుకుంది.
వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కోనాయిపల్లికి చెందిన కొంకటి చంద్రయ్య(80) సోమవారం రాత్రి మృతిచెందారు. ఆయనకు భార్య పోచవ్వ, కుమారుడు నాగరాజు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. నాగరాజు పదేండ్ల క్రితమే మరణించారు. ఆయనకు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్యకు కుమారుడు, రెండో భార్యకు ఇద్దరు కూతుళ్లు. కాగా, చంద్రయ్య పేరుతో ఎకరంన్నర వ్యవసాయ భూమి, ఇల్లు ఉంది. వృద్ధాప్యంలో ఉన్న చంద్రయ్యకు రెండో కోడలు, ఆమె కుమార్తెలు సేవ చేస్తూ వచ్చారు.
కాగా, మూడేండ్ల క్రిమతే తన ఇంటిని కూతుళ్ల పేరుపై రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ఇన్నాళ్లు తాతకు తామే సేవ చేశామని నాగరాజు కూతుళ్లు, రెండో భార్య.. తమకు ఆస్తులను పంచివ్వాలని గొడవకు దిగారు. దీనికి చంద్రయ్య కుమార్తెలు అభ్యంతంరం చెప్పారు. మనవడికి తలకొరివి పెట్టే అవకాశం ఇవ్వాలన్నారు. దీంతో వృద్ధుడి అంత్యక్రియలు నిలిచిపోయాయి. గ్రామంలో పలువురు పెద్ద మనుషులు జోక్యం చేసుకుని వృద్ధుడి మృతదేహానికి అంత్యక్రియలు జరిపించేందుకు చొరవ చూపినా ఫలితం లేకుండాపోయింది. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవడంతో బుధవారం రాత్రి అంత్యక్రియలు పూర్తి చేశారు.
తాజావార్తలు
- ●KTR | సింగరేణిని దివాళా తీయించేందుకు కాంగ్రెస్ కుట్ర: కేటీఆర్
- ●Revanth Reddy | కోవిడ్ లాంటి విపత్తు ఎల్నినో.. అప్రమత్తం కాకపోతే సంక్షోభమే: సీఎం రేవంత్
- ●Indian Coast Guard | ఇండియన్ కోస్ట్ గార్డ్లో 365 నావిక్, యాంత్రిక్ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి!
- ●Revanth Reddy | తెలంగాణలో స్థిరంగా ప్రభుత్వ విధానాలు.. పెట్టుబడులకు పూర్తి భరోసా: సీఎం రేవంత్ రెడ్డి
- ●Horoscope | అక్టోబర్ 15 రాశిఫలాలు.. ఈ రాశివారికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి!
- ●Ramayana | ‘రామాయణ’ ట్రైలర్ వచ్చేస్తోంది..!

KTR | సింగరేణిని దివాళా తీయించేందుకు కాంగ్రెస్ కుట్ర: కేటీఆర్

Revanth Reddy | కోవిడ్ లాంటి విపత్తు ఎల్నినో.. అప్రమత్తం కాకపోతే సంక్షోభమే: సీఎం రేవంత్

Indian Coast Guard | ఇండియన్ కోస్ట్ గార్డ్లో 365 నావిక్, యాంత్రిక్ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి!

Revanth Reddy | తెలంగాణలో స్థిరంగా ప్రభుత్వ విధానాలు.. పెట్టుబడులకు పూర్తి భరోసా: సీఎం రేవంత్ రెడ్డి






