Harish Rao | ప్రజలు, ఉద్యోగులు మీ ఉద్యోగాలు ఊడగొడుతారు చూస్కో రేవంత్: హరీశ్ రావు
Harish Rao | నిరంతరాయంగా విద్యుత్ సరఫరా (Power Cuts) చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏ ఒకరినీ ఉపేక్షించేది లేదని, అవసరమైతే స్పెషల్ సీఎస్, జెన్కో సీఎండీ, సంబంధిత విభాగానికి చెందిన ఐఏఎస్‌లను సస్పెండ్ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) హెచ్చరించడంపై బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు.
Harish Rao | త్రినేత్ర న్యూస్: నిరంతరాయంగా విద్యుత్ సరఫరా (Power Cuts) చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏ ఒకరినీ ఉపేక్షించేది లేదని, అవసరమైతే స్పెషల్ సీఎస్, జెన్కో సీఎండీ, సంబంధిత విభాగానికి చెందిన ఐఏఎస్‌లను సస్పెండ్ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) హెచ్చరించడంపై బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. ప్రజలు, ఉద్యోగులు మీ ఉద్యోగాలు ఊడగోడుతారు చూస్కో అంటూ ముఖ్యమంత్రిని హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి మీ చేతగానితనమే కారణమమని, దానిని విద్యుత్ అధికారులపై నెపం నెట్టడంపై ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.
`తప్పు మీరు చేసి, అధికారుల మీద నెపం నెట్టడం సీఎం, మంత్రులకు పరిపాటిగా మారింది. బొగ్గు నిల్వలు కూడా పెట్టుకోకుండా విద్యుత్ సంక్షోభానికి కారణమైంది మీరు. సమీక్షలు కూడా చేయకుండా, విద్యుత్ రంగాన్ని గాలికి వదిలేసి, కరెంట్ కోతలకు కారణం అయ్యింది మీరు. ఇప్పుడు నింద మొత్తం అధికారుల మీద వేసి, మీరు సుద్ధపూసలా మాట్లాడుతారా?. 9 నెలలుగా ఎల్‌నినో ప్రభావం గురించి వాతావరణ శాఖ, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే వచ్చారు.
కానీ మీరు మాత్రం మొద్దు నిద్రలో ఉన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. ఇప్పుడు నిద్ర లేచి అధికారులను సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారు. నిషేధిత భూముల జాబితాలో తప్పు చేసింది మీ ప్రభుత్వమే. కానీ అధికారుల మీద నెపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కరెంట్ సంక్షోభం విషయంలోనూ మా తప్పేం లేదు, అంతా అధికారులదే అన్నట్లు మాట్లాడుతున్నారు. ఎల్‌నినో కోవిడ్ లాంటి విపత్తు అంటున్నారు. ఈ రెండింటికంటే మించిన విపత్తు మీ పాలన అని ఎందుకు గుర్తించడం లేదు?. అధికారుల ఉద్యోగాలు ఊడతాయని హెచ్చరిస్తున్నావు.. ప్రజలు, అధికారులు నీ ఉద్యోగం ఊడగొట్టకుండా చూసుకో రేవంత్!` అంటూ హరీశ్ రావు మండిపడ్డారు.
సంబంధిత వార్తలు

KTR | సింగరేణిని దివాళా తీయించేందుకు కాంగ్రెస్ కుట్ర: కేటీఆర్
అక్టోబర్ 15, 2026

Revanth Reddy | కోవిడ్ లాంటి విపత్తు ఎల్‌నినో.. అప్రమత్తం కాకపోతే సంక్షోభమే: సీఎం రేవంత్
అక్టోబర్ 15, 2026

Revanth Reddy | తెలంగాణలో స్థిరంగా ప్రభుత్వ విధానాలు.. పెట్టుబడులకు పూర్తి భరోసా: సీఎం రేవంత్ రెడ్డి
అక్టోబర్ 15, 2026
తాజావార్తలు
- ●Property Dispute | ఆస్తి కోసం గొడవ.. మూడు రోజులపాటు ఇంట్లోనే మృతదేహం
- ●KTR | సింగరేణిని దివాళా తీయించేందుకు కాంగ్రెస్ కుట్ర: కేటీఆర్
- ●Revanth Reddy | కోవిడ్ లాంటి విపత్తు ఎల్‌నినో.. అప్రమత్తం కాకపోతే సంక్షోభమే: సీఎం రేవంత్
- ●Indian Coast Guard | ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 365 నావిక్, యాంత్రిక్ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి!
- ●Revanth Reddy | తెలంగాణలో స్థిరంగా ప్రభుత్వ విధానాలు.. పెట్టుబడులకు పూర్తి భరోసా: సీఎం రేవంత్ రెడ్డి
- ●Horoscope | అక్టోబర్ 15 రాశిఫలాలు.. ఈ రాశివారికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి!

Property Dispute | ఆస్తి కోసం గొడవ.. మూడు రోజులపాటు ఇంట్లోనే మృతదేహం

KTR | సింగరేణిని దివాళా తీయించేందుకు కాంగ్రెస్ కుట్ర: కేటీఆర్

Revanth Reddy | కోవిడ్ లాంటి విపత్తు ఎల్‌నినో.. అప్రమత్తం కాకపోతే సంక్షోభమే: సీఎం రేవంత్

Indian Coast Guard | ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 365 నావిక్, యాంత్రిక్ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి!



