త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో కొన‌సాగుతున్న జోష్‌.. భారీగా పెరుగుతున్న బంగారం ధ‌ర‌లు..

Gold And Silver Prices Today | ఇరాన్‌పై మ‌రికొద్ది రోజుల పాటు దాడులు చేయ‌బోమని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. దీంతో ఈక్విటీతోపాటు బులియ‌న్ మార్కెట్ల‌లోనూ జోష్ వ‌చ్చింది. శుక్ర‌వారం మార్కెట్ల‌లో భారీ ర్యాలీ క‌నిపించింది. పెట్టుబ‌డిదారులు సైతం పెద్ద ఎత్తున కొనుగోళ్ల‌కు దిగారు.

S

Business | Published On Oct 10, 2026, 10.55 am IST

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో కొన‌సాగుతున్న జోష్‌.. భారీగా పెరుగుతున్న బంగారం ధ‌ర‌లు..
Advertisement

Gold And Silver Prices Today | ఇరాన్‌పై మ‌రికొద్ది రోజుల పాటు దాడులు చేయ‌బోమని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. దీంతో ఈక్విటీతోపాటు బులియ‌న్ మార్కెట్ల‌లోనూ జోష్ వ‌చ్చింది. శుక్ర‌వారం మార్కెట్ల‌లో భారీ ర్యాలీ క‌నిపించింది. పెట్టుబ‌డిదారులు సైతం పెద్ద ఎత్తున కొనుగోళ్ల‌కు దిగారు. ఇప్ప‌టికే చాలా క‌నిష్ట స్థాయిల్లో షేర్ల ధ‌ర‌లు ఉండ‌డంతో ఇన్వెస్ట‌ర్ల‌కు అవి చ‌క్క‌ని అవ‌కాశంగా క‌నిపించాయి. దీంతో గ‌త సెష‌న్‌లో మార్కెట్లు మ‌ళ్లీ లాభాల బాట ప‌ట్టాయి. ఇక బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తుల‌కు కూడా డిమాండ్ పెరిగింది. డాల‌ర్ విలువ త‌గ్గ‌డంతో ఆటోమేటిగ్గా బంగారం పైచేయి సాధించింది. దీంతో గ‌త సెష‌న్‌లోనూ బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా పెరిగాయి. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్‌ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర 1.49 శాతం ఎగ‌బాకి 4,195 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 2.76 శాతం మేర ఎగ‌సి 60 డాల‌ర్ల‌కు చేరింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1,889 పాయింట్లు పెరిగి 1,51,499కు చేర‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 4,522 పాయింట్లు పెరిగి 2,25,755 వద్ద స్థిర‌ప‌డింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా పెరిగాయి.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,142 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,21,136 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,51,420 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,14,200 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.7,100 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,880 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,11,040గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,38,800 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,88,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.6,500 పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,357 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.90,856గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,13,570 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,35,700గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.5,400 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,40,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,400గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర కిలోకు రూ.5వేలు పెరిగింది. హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,45,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,450 గా ఉంది.

Advertisement
Advertisement