Gold And Silver Prices Today | స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. కొనాలా, వద్దా.. నిపుణులు ఏమంటున్నారు..?
Gold And Silver Prices Today | చాలా రోజుల తరువాత ఆర్‌బీఐ రెపో రేటును పెంచడంతో స్టాక్ మార్కెట్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఓ వైపు పశ్చిమ ఆసియాలో చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడి ధరలు పెరుగుతుండడం, భౌగోళిక రాజకీయ పరిణామాలు తోడవడంతో ఈక్విటీ మార్కెట్లు గత కొంత కాలంగా భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అలాగే బులియన్ మార్కెట్లలోనూ తీవ్ర అస్థిరత నెలకొంది.
Gold And Silver Prices Today | చాలా రోజుల తరువాత ఆర్‌బీఐ రెపో రేటును పెంచడంతో స్టాక్ మార్కెట్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఓ వైపు పశ్చిమ ఆసియాలో చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడి ధరలు పెరుగుతుండడం, భౌగోళిక రాజకీయ పరిణామాలు తోడవడంతో ఈక్విటీ మార్కెట్లు గత కొంత కాలంగా భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అలాగే బులియన్ మార్కెట్లలోనూ తీవ్ర అస్థిరత నెలకొంది. అయితే గురువారం సెషన్‌లో అంతర్జాతీయంగా బంగారం ధరలు కాస్త పెరిగినా దేశీయంగా వాటి ధరల్లో మార్పు లేదు. స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఇది సేఫ్ హావెన్ ఆస్తుల పట్ల పెట్టుబడిదారులకు ఉన్న నిరాసక్తతను తెలియజేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అందువల్ల బంగారం, వెండిలలో కొత్తగా పెట్టుబడులు పెట్టదలచిన వారు కొంత కాలం పాటు వేచి చూస్తే మంచిదని సూచిస్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లలో ఔన్స్ బంగారం ధర ఈ సెషన్‌లో 0.51 శాతం పెరిగి 4,130 డాలర్లకు చేరగా, వెండి ధర 0.26 శాతం పెరిగి 59 డాలర్లకు వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 451 పాయింట్లు పెరిగి 1,49,554 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 50 పాయింట్లు తగ్గి 2,23,511 వద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,957 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,19,656 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,49,570 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,95,700 గా ఉంది. కిందటి ముగింపుతో పోలిస్తే ఈ ధరలో ఎలాంటి మార్పు లేదు.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,710 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,09,680గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,37,100 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,71,000గా ఉంది. క్రితం సెషన్‌తో పోలిస్తే ఈ ధరలోనూ ఎలాంటి మార్పు లేదు.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,218 ఉండగా, 8 గ్రాముల ధర రూ.89,744గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,12,180 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,21,800గా ఉంది. ఈ బంగారం ధర కూడా కిందటి సెషన్‌తో పోలిస్తే మారలేదు.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్‌లలో జోష్.. భారీగా పెరిగిన పసిడి ధరలు..
అక్టోబర్ 9, 2026

Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. బంగారం, వెండి ధరల్లో తీవ్ర అస్థిరత..
అక్టోబర్ 7, 2026

Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..
అక్టోబర్ 6, 2026
తాజావార్తలు
- ●Jim Jim Tara | జగిత్యాల మెడికోలు పాడిన 'జిమ్ జిమ్ తార'.. ఒరిజినల్ ట్యూన్/సాంగ్ ఎక్కడిదో తెలుసా?
- ●Bathukamma | బతుకమ్మ విశిష్టతను విశ్వవ్యాప్తం చేస్తాం
- ●Balmoor Venkat | వీక్లీ సీరియల్లా కేటీఆర్ బాగోతాలు బయటేస్తా
- ●Stock Markets | స్టాక్ మార్కెట్‌లలో జోష్.. 879 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
- ●AICWA | నానా పటేకర్ మృతిపై తనుశ్రీ దత్తా వ్యాఖ్యలు.. తీవ్రంగా ఖండించిన సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్
- ●GO 59 | జీవో 59 దరఖాస్తుదారులకు శుభవార్త

Jim Jim Tara | జగిత్యాల మెడికోలు పాడిన 'జిమ్ జిమ్ తార'.. ఒరిజినల్ ట్యూన్/సాంగ్ ఎక్కడిదో తెలుసా?

Bathukamma | బతుకమ్మ విశిష్టతను విశ్వవ్యాప్తం చేస్తాం

Balmoor Venkat | వీక్లీ సీరియల్లా కేటీఆర్ బాగోతాలు బయటేస్తా

Stock Markets | స్టాక్ మార్కెట్‌లలో జోష్.. 879 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..



