Gold And Silver Prices Today | వీకెండ్ ఎఫెక్ట్.. పెట్టుబడిదారుల లాభాల స్వీకరణ.. భారీగా తగ్గిన పసిడి ధరలు..
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న అమెరికా, ఇరాన్ యుద్ధం ముగియడంపై ఇంకా సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో శుక్రవారం ఈక్విటీ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ఉండడం దేశీయ సూచీలపైనా ఒత్తిడిని పెంచింది. దీంతో భారత బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ, సెన్సెక్స్ ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న అమెరికా, ఇరాన్ యుద్ధం ముగియడంపై ఇంకా సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో శుక్రవారం ఈక్విటీ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ఉండడం దేశీయ సూచీలపైనా ఒత్తిడిని పెంచింది. దీంతో భారత బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ, సెన్సెక్స్ ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. మరోవైపు బులియన్ మార్కెట్లలో గత సెషన్‌లో ర్యాలీ అనంతరం పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడంతో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర ఈ సెషన్‌లో 1.10 శాతం తగ్గి 4,043 డాలర్లకు చేరగా, వెండి ధర 0.72 శాతం తగ్గి 51 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2388 పాయింట్లు తగ్గి 1,41,707 పాయింట్లకు చేరగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 3850 పాయింట్లు తగ్గి 1,83,290 వద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బంగారం ధర ఒక్క రోజులోనే రూ.25వేలకు పైగా తగ్గగా, వెండి ధరలో రూ.5వేల పతనం నమోదైంది.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,346 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,14,768 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,43,460 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,34,600 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.25,600 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,150 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,05,200గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,31,500 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,15,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.23,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,759 ఉండగా, 8 గ్రాముల ధర రూ.86,072గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,07,590 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,75,900గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.19,300 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,05,000 ఉండగా, తులం ధర రూ.2,050గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.5వేలు తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,05,000 ఉండగా, తులం ధర రూ.2,050 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. ఒక్క రోజులోనే రూ.32వేలు పెరిగిన పసిడి ధర..
నవంబర్ 5, 2026

Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్లలో జోరు.. పసిడి కొనుగోళ్లకు సైతం మొగ్గు..
నవంబర్ 4, 2026

WGC Gold | బంగారానికి తగ్గిన గిరాకీ.. ధరల పెరుగుదలే కారణమా..?
నవంబర్ 3, 2026
తాజావార్తలు
- ●Kochi | వైద్యం పేరుతో డాక్టర్‌ను ఇంటికి పిలిచి.. నిలువునా దోచుకున్న నటులు
- ●Kamareddy | కూతూరును కాపాండేందుకు చెరువులోకి దిగిన తండ్రి.. నీట మునిగి ఇద్దరూ మృతి
- ●Road Accident | జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఏడుగురు మృతి
- ●Metro RTC Common Pass | రాష్ట్ర ప్రజలకు దీపావళి కానుక.. భారీగా తగ్గిన మెట్రో-ఆర్టీసీ నెలవారీ పాస్ ధర
- ●Stock Markets | గ్లోబల్ మార్కెట్లలో భారీ పతనం.. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా..
- ●Cab Driver | భార్యతో గొడవ.. ఆమెతోపాటు ఏడుగురిని హత్యచేసిన క్యాబ్ డ్రైవర్

Kochi | వైద్యం పేరుతో డాక్టర్‌ను ఇంటికి పిలిచి.. నిలువునా దోచుకున్న నటులు

Kamareddy | కూతూరును కాపాండేందుకు చెరువులోకి దిగిన తండ్రి.. నీట మునిగి ఇద్దరూ మృతి

Road Accident | జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఏడుగురు మృతి

Metro RTC Common Pass | రాష్ట్ర ప్రజలకు దీపావళి కానుక.. భారీగా తగ్గిన మెట్రో-ఆర్టీసీ నెలవారీ పాస్ ధర



