WGC Gold | బంగారానికి తగ్గిన గిరాకీ.. ధరల పెరుగుదలే కారణమా..?
WGC Gold | ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు పసిడి గిరాకీపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ ఒక శాతం తగ్గి 1,369 టన్నులకు చేరినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నివేదిక వెల్లడించింది. ధరల పెరుగుదలతో మొత్తం డిమాండ్ విలువ 22 శాతం పెరిగి 188 బిలియన్ డాలర్లకు చేరింది.
- ప్రపంచవ్యాప్తంగా ఒకశాతం పడిపోయిన పసిడి డిమాండ్
- ఆభరణాల కొనుగోళ్లు 17 శాతం డౌన్
- ఈటీఎఫ్‌లు, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లలో మాత్రం జోరు
WGC Gold | ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు పసిడి గిరాకీపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ ఒక శాతం తగ్గి 1,369 టన్నులకు చేరినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నివేదిక వెల్లడించింది. ధరల పెరుగుదలతో మొత్తం డిమాండ్ విలువ 22 శాతం పెరిగి 188 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ త్రైమాసికంలో ఔన్సు బంగారం సగటు ధర 4,262 డాలర్లుగా నమోదైంది. అధిక ధరల ప్రభావం ఆభరణాల కొనుగోళ్లపై ఎక్కువగా పడింది. ప్రపంచవ్యాప్తంగా జువెలరీ డిమాండ్ 17 శాతం తగ్గి 313 టన్నులకు పరిమితమైంది. మూడో త్రైమాసికాల్లో ఇదే అత్యల్ప స్థాయి. చైనాలో 22 శాతం, భారత్‌లో 19.5 శాతం మేర ఆభరణాల గిరాకీ పడిపోయింది. వినియోగదారులు తక్కువ బరువు, తక్కువ క్యారెట్ల ఆభరణాల వైపు మొగ్గుచూపుతున్నారు.
ఈటీఎఫ్‌లలో పెట్టుబడుల జోరు
భౌతిక బంగారంతో మద్దతున్న గోల్డ్ ఈటీఎఫ్‌లలో మళ్లీ పెట్టుబడులు పెరిగాయి. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో వీటిలోకి 211 టన్నుల పెట్టుబడులు వచ్చాయి. యూరప్ ఫండ్లలో అత్యధికంగా 92 టన్నుల పెట్టుబడులు నమోదయ్యాయి. 2022 తొలి త్రైమాసికం తర్వాత ఇదే అత్యధిక పెరుగుదల. కేంద్ర బ్యాంకులు, ఇతర అధికారిక సంస్థలు తమ నిల్వలకు నికరంగా 321 టన్నుల బంగారాన్ని పెంచుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇది 42 శాతం అధికం. 2024 నాలుగో త్రైమాసికం తర్వాత ఇదే అత్యధిక కొనుగోళ్లు. పెట్టుబడుల విస్తరణ, రిస్క్ నిర్వహణలో భాగంగా చైనా, పోలండ్, చెక్ రిపబ్లిక్ వంటి దేశాలు పసిడి నిల్వలను పెంచుకున్నాయి. మరోవైపు బంగారు బార్లు, నాణేల కొనుగోళ్లు 19 శాతం తగ్గి 268 టన్నులకు చేరాయి. ధరల విషయంలో స్పష్టత లేకపోవడంతో వ్యక్తిగత పెట్టుబడిదారులు కొనుగోళ్లకు వెనుకంజ వేశారు. అయితే, చైనా, భారత్‌లో ధరలు కొంత తగ్గడం, సీజనల్ డిమాండ్ పెరగడంతో త్రైమాసిక ప్రాతిపదికన గిరాకీ 12 శాతం మెరుగుపడింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●IVPA Global Round Table Meeting | గ్లోబల్ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా రండి.. తుమ్మలకు ఐవీపీఏ ప్రతినిధుల ఆహ్వానం
- ●GHMC Street Lights | జీహెచ్ఎంసీ స్ట్రీట్ లైట్స్‌లో కుంభకోణం.. బెంచ్ మార్క్ ధరకు 4.49 శాతం అధికం
- ●SD Pay App Scam | నెలకు 9% లాభమంటూ నమ్మించారు.. 6.5 లక్షల మందిని ముంచి 1200 కోట్లు కొల్లగొట్టారు!
- ●NEET PG | నీట్ పీజీ ప్రవేశాల్లో కీలక మార్పులు!
- ●Cyberabad Traffic Police | రేపు, ఎల్లుండి త్వరగా లాగౌట్ అవ్వండి.. టెకీలకు సైబరాబాద్ పోలీసుల సూచన
- ●Indiramma Illu | సొంత భూమి ఉంటే.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం

IVPA Global Round Table Meeting | గ్లోబల్ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా రండి.. తుమ్మలకు ఐవీపీఏ ప్రతినిధుల ఆహ్వానం

GHMC Street Lights | జీహెచ్ఎంసీ స్ట్రీట్ లైట్స్‌లో కుంభకోణం.. బెంచ్ మార్క్ ధరకు 4.49 శాతం అధికం

SD Pay App Scam | నెలకు 9% లాభమంటూ నమ్మించారు.. 6.5 లక్షల మందిని ముంచి 1200 కోట్లు కొల్లగొట్టారు!

NEET PG | నీట్ పీజీ ప్రవేశాల్లో కీలక మార్పులు!





