Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. పసిడిపై ఆసక్తి తగ్గుతుందా..?
Gold And Silver Prices Today | దేశీయ, విదేశీ ఈక్విటీ మార్కెట్లలో బుల్ ర్యాలీలో కొనసాగుతుండడంతో అంతగా వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తుల వైపు పెట్టుబడిదారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఆయా లోహాల ధరలు భారీగా తగ్గాయి. అయితే అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో మాత్రం మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఓ మార్కెట్లో ధరలు పెరగ్గా, మరో మార్కెట్లో ధరలు తగ్గాయి.
Gold And Silver Prices Today | దేశీయ, విదేశీ ఈక్విటీ మార్కెట్లలో బుల్ ర్యాలీలో కొనసాగుతుండడంతో అంతగా వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తుల వైపు పెట్టుబడిదారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఆయా లోహాల ధరలు భారీగా తగ్గాయి. అయితే అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో మాత్రం మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఓ మార్కెట్లో ధరలు పెరగ్గా, మరో మార్కెట్లో ధరలు తగ్గాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 0.54 శాతం తగ్గి 3,924 డాలర్లకు చేరగా, వెండి ధర 2.28 శాతం పతనమై 49 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1163 పాయింట్లు తగ్గి 1,39,023కి చేరగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 4801 పాయింట్లు తగ్గి 1,78,719కు చేరింది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,964 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,11,712 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,39,640 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.13,96,400 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.2,700 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.12,800 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,02,400గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,28,000 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.12,80,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,473 ఉండగా, 8 గ్రాముల ధర రూ.83,784గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,04,730 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,47,300గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,000 పెరిగింది.
దేశీయ మార్కెట్లో 1 కిలో వెండి ధర రూ.2,00,000 ఉండగా, తులం ధర రూ.2,000గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,00,000 ఉండగా, తులం ధర రూ.2,000 గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | మళ్లీ పెరుగుతున్న పసిడి ధరలు.. ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్..
నవంబర్ 2, 2026

Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. ఒక్క రోజులోనే రూ.33వేలు తగ్గిన పసిడి ధర..
అక్టోబర్ 31, 2026

Gold Prices | బంగారం ధరలు ఢమాల్.. అంచనాలకు మించి అమెరికా వృద్ధి..
అక్టోబర్ 30, 2026
తాజావార్తలు
- ●Indian sailor | ఒమన్ తీరంలో భారతీయ నౌకపై దాడి.. గుజరాత్ నావికుడు మృతి
- ●Baththa Movie Review | పెద్ద రౌడీ వాష్‌రూమ్‌లో ఎనిమిది రోజులు చిక్కుకుపోతే...విజయ్ సేతుపతి బత్తా మూవీ ఎలా ఉందంటే?
- ●Helicopters Collide In Nepal | రెండు హెలికాప్టర్లు ఢీ.. భారతీయుడు మృతి
- ●LIC | పిల్లల భవిష్యత్తు కోసం రూ.30 లక్షలు.. ఎల్ఐసీ పాలసీలతో సాధ్యమేనా..?
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోరు.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..
- ●Komatireddy Rajagopal Reddy | అధికారంలో ఉండి ప్రతిపక్ష ఎమ్మెల్యేలాగా నిధులు అడగాల్సి వస్తుంది

Indian sailor | ఒమన్ తీరంలో భారతీయ నౌకపై దాడి.. గుజరాత్ నావికుడు మృతి

Baththa Movie Review | పెద్ద రౌడీ వాష్‌రూమ్‌లో ఎనిమిది రోజులు చిక్కుకుపోతే...విజయ్ సేతుపతి బత్తా మూవీ ఎలా ఉందంటే?

Helicopters Collide In Nepal | రెండు హెలికాప్టర్లు ఢీ.. భారతీయుడు మృతి

LIC | పిల్లల భవిష్యత్తు కోసం రూ.30 లక్షలు.. ఎల్ఐసీ పాలసీలతో సాధ్యమేనా..?



