Army Recruitment Rally | ఈనెల 13 నుంచి 24 వరకు.. గచ్చిబౌలిలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
Army Recruitment Rally | సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు ఇండియన్ ఆర్మీ (Indian Army) గుడ్ న్యూస్ అందించింది. హైదరాబాద్‌లో అగ్నివీరుల (Agniveer) నియామకానికి రిక్రూట్‌మెంట్ ర్యాలీ (Army Recruitment Rally) నిర్వహించనుంది.
Army Recruitment Rally | త్రినేత్ర న్యూస్: సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు ఇండియన్ ఆర్మీ (Indian Army) గుడ్ న్యూస్ అందించింది. హైదరాబాద్‌లో అగ్నివీరుల (Agniveer) నియామకానికి రిక్రూట్‌మెంట్ ర్యాలీ (Army Recruitment Rally) నిర్వహించనుంది. నవంబర్ 13 నుంచి 24 వరకు రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలోని (Gachibowli) జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో ఈ ర్యాలీ జరుగనుంది. రాష్ట్రాంలోని మొత్తం 33 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దీనికి హాజరుకావచ్చు. ఇందులో భాగంగా అగ్నివీర్ జనరల్ డ్యూటీ (GD), టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ (10వ తరగతి ఉత్తీర్ణులు), ట్రేడ్స్‌మెన్ (8వ తరగతి ఉత్తీర్ణులు) విభాగాలలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అడ్మిట్ కార్డులు పొందిన అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అన్ని ఒరిజినల్ ధృవీకరణ పత్రాలను చూపింసాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ www.joinindianarmy.nic.inను సందర్శించవచ్చు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్‌ను 040-27740059 నంబరులో సంప్రదించవచ్చు.
అగ్నివీర్ పోస్టుల వివరాలు..
అగ్నివీర్ జనరల్ డ్యూటీ
అగ్నివీర్ టెక్నికల్
అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ (10వ తరగతి ఉత్తీర్ణత)
అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ (8వ తరగతి ఉత్తీర్ణత)
వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Stock Markets | దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 950 పాయింట్ల జంప్..
- ●Dhanteras 2026 | ధన్‌తేరస్‌కు బంగారం కొనాలనుకుంటున్నారా? గోల్డ్ వాల్ట్ గురించి తెలుసుకోండి!
- ●Ration | నేటి నుంచి నవంబర్ కోటా రేషన్ బియ్యం పంపిణీ
- ●Wedding Feast | పెండ్లి విందులో ఫుడ్ పాయిజనింగ్.. కొత్త జంట సహా 30 మందికి అస్వస్థత
- ●Plane Crash | కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది దుర్మరణం
- ●Traffic Restrictions | హైదరాబాద్‌లో అమిత్‌షా పాదయాత్ర.. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

Stock Markets | దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 950 పాయింట్ల జంప్..

Dhanteras 2026 | ధన్‌తేరస్‌కు బంగారం కొనాలనుకుంటున్నారా? గోల్డ్ వాల్ట్ గురించి తెలుసుకోండి!

Ration | నేటి నుంచి నవంబర్ కోటా రేషన్ బియ్యం పంపిణీ

Wedding Feast | పెండ్లి విందులో ఫుడ్ పాయిజనింగ్.. కొత్త జంట సహా 30 మందికి అస్వస్థత






