త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | మ‌ద్యం మ‌త్తు.. ఐదేండ్ల కుమారుడిని గొంతు పిసికి చంపిన తండ్రి

Hyderabad | హైద‌రాబాద్‌లోని (Hyderabad) బోర‌బండ‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కొడుకునే హత్య చేశాడో తండ్రి. బోరబండలోని (Borabanda) శిల్పినగర్‌లో విద్యాసాగ‌ర్ (36), దుర్గ దంప‌తులు నివాసం ఉంటున్నారు.

G

Hyderabad | Published On Nov 2, 2026, 10.36 am IST

Hyderabad | మ‌ద్యం మ‌త్తు.. ఐదేండ్ల కుమారుడిని గొంతు పిసికి చంపిన తండ్రి
Advertisement

Hyderabad | త్రినేత్ర న్యూస్‌: హైద‌రాబాద్‌లోని (Hyderabad) బోర‌బండ‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కొడుకునే హత్య చేశాడో తండ్రి. బోరబండలోని (Borabanda) శిల్పినగర్‌లో విద్యాసాగ‌ర్ (36), దుర్గ దంప‌తులు నివాసం ఉంటున్నారు. వారికి ఐదేండ్ల కుమారుడు విజయ్ ఉన్నారు. విద్యాసాగ‌ర్ మ‌ద్యానికి బానిస (Alcohol Intoxication) అవడంతో.. క్యాట‌రింగ్ ప‌నికివెళ్తూ దుర్గ కుటుంటాన్ని పోషిస్తున్న‌ది. ఈ క్ర‌మంలో గ‌త రాత్రి కూడా విద్యాసాగర్ పూటుగా మద్యం సేవించి ఇంటికి వ‌చ్చాడు. మ‌ద్యం మ‌త్తులో ఉన్న అత‌డు కొడుకు గొంతు పిసికి చంపేశాడు. ఆ సమయంలో దుర్గ క్యాటరింగ్ పనికి వెళ్లినట్లు తెలుస్తున్న‌ది.

కాగా, తెల్లవారుజామున ఇంటికి వచ్చి చూడగా కుమారుడు విగతజీవిగా కనిపించాడు. దీంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. స్థానికుల స‌మాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు విద్యాసాగర్ ప్ర‌స్తుతం పరారీలో ఉన్నాడు. దీంతో అత‌ని కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్:

Alcohol IntoxicationBorabandaCateringDrunk ManHyderabad
Advertisement
Advertisement