Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లు కుదేలు.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
Gold And Silver Prices Today | అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఫెడ్ మరోమారు వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాల మేరకు అమెరికా డాలర్ బలపడుతోంది. దీంతో బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం పడుతోంది. గత రెండు వారాలుగా ఈ లోహాల ధరల్లో భారీ దిద్దుబాటు కనిపిస్తోంది.
Gold And Silver Prices Today | అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఫెడ్ మరోమారు వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాల మేరకు అమెరికా డాలర్ బలపడుతోంది. దీంతో బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం పడుతోంది. గత రెండు వారాలుగా ఈ లోహాల ధరల్లో భారీ దిద్దుబాటు కనిపిస్తోంది. ఈ క్రమంలో బుధవారం సైతం మరోమారు వీటి ధరలు పతనమయ్యాయి. మరోవైపు ఈక్విటీ మార్కెట్లలో వస్తున్న ర్యాలీ కారణంగా పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బులియన్ మార్కెట్ల నుంచి ఈక్విటీల వైపు మళ్లిస్తున్నారు. ఇది కూడా ఆయా లోహల ధరల క్షీణతకు కారణమవుతోంది. ఇక బుధవారం అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లలో ఔన్స్ బంగారం ధర 0.46 శాతం తగ్గి 3,538 డాలర్లకు చేరగా, వెండి ధర 1.17 శాతం పతనమై 40 డాలర్లకు దిగి వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1027 పాయింట్లు తగ్గి 1,21,302కు చేరగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2046 పాయింట్లు తగ్గి 1,43,441కు వచ్చింది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధర ఒక్క రోజే రూ.32వేలకు పైగా తగ్గగా, వెండి ధర రూ.10వేలు తగ్గింది.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.12,458 ఉండగా, 8 గ్రాముల ధర రూ.99,664 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,24,580 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.12,45,800 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.32,200 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,420 ఉండగా, 8 గ్రాముల ధర రూ.91,360గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,14,200 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,42,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.29,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.9,344 ఉండగా, 8 గ్రాముల ధర రూ.74,752గా ఉంది. 10 గ్రాముల ధర రూ.93,440 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.9,34,400గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.24,100 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.1,65,000 ఉండగా, తులం ధర రూ.1,650గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.10వేలు తగ్గింది. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.1,65,000 ఉండగా, తులం ధర రూ.1,650 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడులకు ఇదే అనుకూల సమయమా..?
నవంబర్ 24, 2026

Bullion Market | ఐదురోజుల నష్టాలకు బ్రేక్.. మళ్లీ పుంజుకున్న పసిడి, వెండి..!
నవంబర్ 23, 2026

CTI | బంగారం కొనొద్దన్న మోదీ.. మాకు మేలు చేసిదంటూ ప్రధానికి సీటీఐ లేఖ!
నవంబర్ 22, 2026
తాజావార్తలు
- ●Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. 1,000 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్..
- ●Mahesh Babu Instagram Comment | మహేశ్ బాబు ఒక్క కామెంట్.. ఓవర్‌నైట్ స్టార్ అయిన చిన్నారి!
- ●Microsoft Code Red | 24 గంటల పాటు స్తంభించిన సేవలు.. మైక్రోసాఫ్ట్‌లో 'కోడ్ రెడ్' హై అలర్ట్!
- ●Puri Jagannath Temple Full Moon | పూరీ జగన్నాథ ఆలయ నీలచక్రంలో కొలువుదీరిన నిండు చందమామ
- ●Black Hole | విశ్వంలోనే అతిపెద్ద మిస్టరీ బ్లాక్ హోల్ : లోపలికి వెళితే కాలం ఆగిపోతుందా? భూమిని మింగేసే ప్రమాదం ఉందా?
- ●Faridabad OYO Hotel Case | కాలేజీకని చెప్పి ప్రియుడితో ఓయో హోటల్‌కు.. మరుసటి రోజు విగతజీవిగా 19 ఏళ్ల విద్యార్థిని!

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. 1,000 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్..

Mahesh Babu Instagram Comment | మహేశ్ బాబు ఒక్క కామెంట్.. ఓవర్‌నైట్ స్టార్ అయిన చిన్నారి!

Microsoft Code Red | 24 గంటల పాటు స్తంభించిన సేవలు.. మైక్రోసాఫ్ట్‌లో 'కోడ్ రెడ్' హై అలర్ట్!

Puri Jagannath Temple Full Moon | పూరీ జగన్నాథ ఆలయ నీలచక్రంలో కొలువుదీరిన నిండు చందమామ



