Gold And Silver Prices Today | బంగారం, వెండిపై పెట్టుబడులు పెరుగుతున్నాయా..? ధరలు ఎలా ఉన్నాయి..?
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు, శాంతి చర్చలపై సందిగ్ధత నెలకొన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్ కొనసాగింది. అయితే శుక్రవారం సెషన్‌లో మాత్రం ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. కానీ బంగారం, వెండి ధరలపై ఈక్విటీ మార్కెట్ల ప్రభావం పడలేదు. దీంతో ఆ లోహాల ధరలు భారీగా పెరిగాయి.
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు, శాంతి చర్చలపై సందిగ్ధత నెలకొన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్ కొనసాగింది. అయితే శుక్రవారం సెషన్‌లో మాత్రం ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. కానీ బంగారం, వెండి ధరలపై ఈక్విటీ మార్కెట్ల ప్రభావం పడలేదు. దీంతో ఆ లోహాల ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1.05 శాతం మేర పెరిగి 4,726 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 2.72 శాతం ఎగబాకి 80.59 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 680 పాయింట్లు పెరిగి 1,52,941 వద్ద ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 3,610 పాయింట్లు పెరిగి 2,62,150 వద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,268 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,22,144 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,52,680 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,26,800 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.3,200 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,995 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,11,960గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,39,950 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,99,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3వేలు తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,451 ఉండగా, 8 గ్రాముల ధర రూ.91,608గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,14,510 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,45,100గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,400 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,77,000 ఉండగా, తులం ధర రూ.2,750గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ ధర కేజీకి రూ.5వేలు పెరిగింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,74,900 ఉండగా, తులం ధర రూ.2,749 గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

PM Modi | ప్రధాని మోదీ కామెంట్ల ఎఫెక్ట్.. జువెలరీ స్టాక్స్ భారీగా పతనం..
సెప్టెంబర్ 1, 2026

Gold And Silver Prices Today | నష్టాలకు బ్రేక్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
సెప్టెంబర్ 1, 2026

Gold And Silver Prices Today | యుద్ధం ఎఫెక్ట్.. ఒక్క రోజులోనే రూ.15వేలు తగ్గిన బంగారం ధర..
ఆగస్టు 31, 2026
తాజావార్తలు
- ●Anushka | హారర్ కామెడీ కథతో అనుష్క కమ్‌బ్యాక్ - రెండేళ్ల తర్వాత కొత్త సినిమాకు జేజమ్మ గ్రీన్‌సిగ్నల్
- ●Adobe Photoshop | ఫొటోషాప్‌లో ఏఐ ఎడిటింగ్ మరింత సులువు.. కొత్త ఫీచర్లు ఇవే..
- ●Revanth Reddy 1000 Days | ఓవైపు 1000 రోజుల పాలన.. మరోవైపు సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల కన్నీళ్లు
- ●Minister Ponnam | కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై స్టే ఎత్తివేత హర్షణీయం : మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Mamata Banerjee | మమతా బెనర్జీ మేనకోడలు ఆత్మహత్య
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప నష్టాలు.. ఆటో, రియాల్టీ షేర్లకు దెబ్బ..

Anushka | హారర్ కామెడీ కథతో అనుష్క కమ్‌బ్యాక్ - రెండేళ్ల తర్వాత కొత్త సినిమాకు జేజమ్మ గ్రీన్‌సిగ్నల్

Adobe Photoshop | ఫొటోషాప్‌లో ఏఐ ఎడిటింగ్ మరింత సులువు.. కొత్త ఫీచర్లు ఇవే..

Revanth Reddy 1000 Days | ఓవైపు 1000 రోజుల పాలన.. మరోవైపు సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల కన్నీళ్లు

Minister Ponnam | కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై స్టే ఎత్తివేత హర్షణీయం : మంత్రి పొన్నం ప్రభాకర్



