త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | మ‌ళ్లీ మొద‌లైన యుద్ధ భ‌యాలు.. భారీగా ప‌త‌న‌మైన బంగారం, వెండి ధ‌ర‌లు..

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య మ‌ళ్లీ యుద్ధ ఉద్రిక్త‌త‌లు నెల‌కొన‌డంతో గ‌త మూడు రోజుల నుంచి అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర అమ్మ‌కాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ ప్ర‌భావం బులియ‌న్ మార్కెట్ల‌పైనా ప‌డుతోంది. గ‌త కొద్ది రోజులుగా బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా ప‌త‌న‌మ‌వుతున్నాయి.

S

Business | Published On Jun 6, 2026, 11.09 am IST

Gold And Silver Prices Today | మ‌ళ్లీ మొద‌లైన యుద్ధ భ‌యాలు.. భారీగా ప‌త‌న‌మైన బంగారం, వెండి ధ‌ర‌లు..
Advertisement

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య మ‌ళ్లీ యుద్ధ ఉద్రిక్త‌త‌లు నెల‌కొన‌డంతో గ‌త మూడు రోజుల నుంచి అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర అమ్మ‌కాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ ప్ర‌భావం బులియ‌న్ మార్కెట్ల‌పైనా ప‌డుతోంది. గ‌త కొద్ది రోజులుగా బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా ప‌త‌న‌మ‌వుతున్నాయి. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్‌లో గ‌త సెష‌న్ ముగింపు వ‌ర‌కు ఔన్స్ బంగారం ధ‌ర ఏకంగా 3.29 శాతం త‌గ్గి 4,328 వ‌ద్ద నిలిచింది. వెండి ధ‌ర 8 శాతానికి పైగా ప‌త‌న‌మై 67.88 డాల‌ర్ల వ‌ద్ద నిలిచింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 3,953 పాయింట్లు త‌గ్గి 1,55,594 వ‌ద్ద నిల‌వ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 16,259 పాయింట్లు ప‌త‌న‌మై 2,48,537 వ‌ద్ద స్థిర‌ప‌డింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,273 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,22,184 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,52,730 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,27,300 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.30వేలు త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14వేలు ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,12,000గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,40,000 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,00,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.27,500 త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,455 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.91,640గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,14,550 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,45,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.22,500 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,65,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,650గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.10వేలు త‌గ్గింది. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,70,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,700 గా ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement