Gold And Silver Prices Today | భారీగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతుందా..?
Gold And Silver Prices Today | గత వారం రోజుల నుంచి భారీగా క్షీణించిన బంగారం, వెండి ధరల పతనానికి కాస్త బ్రేక్ పడింది. గత సెషన్‌లో ఆయా లోహాలు భారీగా పెరుగుదలను నమోదు చేశాయి. ధరలు ఆకర్షణీయంగా మారడంతో పెట్టుబడిదారులు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించినట్లు స్పష్టమవుతోంది.
Gold And Silver Prices Today | గత వారం రోజుల నుంచి భారీగా క్షీణించిన బంగారం, వెండి ధరల పతనానికి కాస్త బ్రేక్ పడింది. గత సెషన్‌లో ఆయా లోహాలు భారీగా పెరుగుదలను నమోదు చేశాయి. ధరలు ఆకర్షణీయంగా మారడంతో పెట్టుబడిదారులు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించినట్లు స్పష్టమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1.56 శాతం ఎగసి 4,088 డాలర్లకు చేరగా, వెండి ధర 2.31 శాతం మేర ఎగబాకి 59 డాలర్లకు చేరుకుంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 0.72 శాతం పెరిగి 1,44,162 వద్ద ముగియగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 0.79 శాతం మేర పెరిగి 2,21,404 వద్ద స్థిరపడింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు బారీగా పెరగ్గా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,395 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,15, 160 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,43,950 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,39,500 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.12,000 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,195 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,05,560గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,31,950 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,19,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.11,000 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,796 ఉండగా, 8 గ్రాముల ధర రూ.86,368గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,07,960 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,79,600గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.9000 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,40,000 ఉండగా, తులం ధర రూ.2,400గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver ETF | భారీగా పతనమవుతున్న గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లు.. ధరలు ఇంకా తగ్గుతాయా..?
జూన్ 26, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. కొనుగోదారుల ఆసక్తి పెరుగుతుందా..?
జూన్ 26, 2026

RGIA | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ. 3 కోట్ల విలువ చేసే బంగారం సీజ్
జూన్ 26, 2026
తాజావార్తలు
- ●Harish Rao | నువ్ ఏం ఒప్పందం చేసినవో ప్రజలకు చెప్పు
- ●Nithin Kamath | జిమ్ మెంబర్ షిప్ కన్నా జీఎల్పీ-1 మందులే తక్కువ ధర.. అయినా భారతీయులకు ఆసక్తి లేదు: నితిన్ కామత్
- ●MLA Rammohan Reddy | పరిగిలో కేటీఆర్ మీటింగ్.. లేచి వెళ్లిపోయిన జనం: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
- ●New Bride Death | బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్.. ప్రాణాలు కోల్పోయిన నవ వధువు
- ●Heavy Rain | హైదరాబాదీలకు అలర్ట్.. సాయంత్రం 6 తర్వాత బయటకు వెళ్లారో ఇక అంతే!
- ●Anthropic | అమెరికా గ్రీన్ సిగ్నల్.. ఆంథ్రోపిక్ మైథోస్ ఏఐ మోడల్‌కు మళ్లీ అనుమతి..

Harish Rao | నువ్ ఏం ఒప్పందం చేసినవో ప్రజలకు చెప్పు

Nithin Kamath | జిమ్ మెంబర్ షిప్ కన్నా జీఎల్పీ-1 మందులే తక్కువ ధర.. అయినా భారతీయులకు ఆసక్తి లేదు: నితిన్ కామత్

MLA Rammohan Reddy | పరిగిలో కేటీఆర్ మీటింగ్.. లేచి వెళ్లిపోయిన జనం: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

New Bride Death | బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్.. ప్రాణాలు కోల్పోయిన నవ వధువు



