త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RGIA | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ. 3 కోట్ల విలువ చేసే బంగారం సీజ్

RGIA | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గోల్డ్ స్మ‌గ్ల‌ర్లు ప‌ట్టుబ‌డుతూనే ఉన్నారు. తాజాగా కౌలాలంపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఇద్ద‌రు ప్ర‌యాణికుల నుంచి 2.271 కేజీల బంగారాన్ని హైద‌రాబాద్ క‌స్ట‌మ్స్ అధికారులు సీజ్ చేశారు.

S

Hyderabad | Published On Jun 26, 2026, 10.15 am IST

RGIA | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ. 3 కోట్ల విలువ చేసే బంగారం సీజ్
Advertisement

RGIA | త్రినేత్ర‌.న్యూస్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గోల్డ్ స్మ‌గ్ల‌ర్లు ప‌ట్టుబ‌డుతూనే ఉన్నారు. తాజాగా కౌలాలంపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఇద్ద‌రు ప్ర‌యాణికుల నుంచి 2.271 కేజీల బంగారాన్ని హైద‌రాబాద్ క‌స్ట‌మ్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ ప‌ట్టుబ‌డ్డ బంగారం విలువ రూ. 3.36 కోట్లు ఉంటుంద‌ని అధికారులు పేర్కొన్నారు.

జూన్ 25న కౌలాలంపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వ‌చ్చిన ఓ ఇద్ద‌రు ప్ర‌యాణికులు అనుమానాస్ప‌దంగా క‌నిపించారు. దీంతో వారిని అధికారులు అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా త‌నిఖీలు చేశారు. ప్ర‌యాణికులిద్ద‌రూ కూడా త‌మ ప్యాంట్ల‌లో బంగారం దాచి త‌ర‌లిస్తున్న‌ట్లు గుర్తించారు. బంగారం స్వాధీనం చేసుకున్న అనంత‌రం.. వారిని పోలీసుల‌కు అప్ప‌గించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement
Advertisement