Google Finance | పెట్టుబడిదారులకు గూగుల్ గుడ్ న్యూస్.. ఇక ఏఐ సహాయంతో ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ చేయవచ్చు..
Google Finance | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన జెమిని ఏఐ ప్లాట్‌ఫామ్‌లో ఇటీవల అనేక భారీ అప్‌డేట్‌లను అందుబాటులోకి తెచ్చింది. యూజర్లకు అనేక పనులు మరింత సౌకర్యవంతం అయ్యేలా పలు ఫీచర్లను ఆ ప్లాట్‌ఫామ్‌లో ఏఐ సహాయంతో అందిస్తోంది. తాజాగా తన ఫైనాన్స్ సేవకు కూడా భారీ అప్‌డేట్‌ను ప్రకటించింది.
Technology | Published On Jun 26, 2026, 1.31 pm IST
Google Finance | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన జెమిని ఏఐ ప్లాట్‌ఫామ్‌లో ఇటీవల అనేక భారీ అప్‌డేట్‌లను అందుబాటులోకి తెచ్చింది. యూజర్లకు అనేక పనులు మరింత సౌకర్యవంతం అయ్యేలా పలు ఫీచర్లను ఆ ప్లాట్‌ఫామ్‌లో ఏఐ సహాయంతో అందిస్తోంది. తాజాగా తన ఫైనాన్స్ సేవకు కూడా భారీ అప్‌డేట్‌ను ప్రకటించింది. ఇందులో పలు అద్భుతమైన ఫీచర్లను ఇచ్చారు. ఈ కొత్త అప్‌డేట్‌తో యూజర్లు తమ స్టాక్ పోర్ట్‌ఫోలియోను మరింత సమర్థవంతంగా ట్రాక్ చేయవచ్చు. ఏఐ ఆధారిత మార్కెట్ అప్‌డేట్స్‌ను పొందవచ్చు. ఇందుకు గాను ప్రత్యేక ఆండ్రాయిడ్ యాప్‌ను కూడా గూగుల్ లాంచ్ చేసింది. యూజర్లు తమ పెట్టుబడులను సులభంగా ట్రాక్ చేయడం, పోర్ట్‌ఫోలియోలను విశ్లేషించడం, వ్యక్తిగత ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఆర్థిక సమాచారం పొందడం వంటి పనులను ఇక చాలా సులభంగా పూర్తి చేయవచ్చు.
పెట్టుబడుల వివరాలన్నీ ఒకే డ్యాష్ బోర్డులో..
కొత్త అప్‌డేట్‌లో యూజర్లు స్క్రీన్‌షాట్లు, సీఎస్‌వీ లేదా పీడీఎఫ్ ఫైల్స్‌ను అప్‌లోడ్ చేసి లేదా సహజ భాషలో వివరాలను ఇవ్వడం ద్వారా తమ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను సృష్టించవచ్చు. ఏఐ ఆధారిత రీసెర్చ్ టూల్స్‌తోపాటు, యూజర్లు ఎంచుకున్న అంశాలు, పెట్టుబడుల ఆధారంగా షెడ్యూల్ ప్రకారం మార్కెట్ బ్రీఫింగ్‌లను ఏఐ అందిస్తుంది. గూగుల్ ఫైనాన్స్ కొత్త అప్‌డేట్‌లో యూజర్లు తమ పెట్టుబడులు అన్నింటినీ ఒకే పోర్ట్‌ఫోలియో డ్యాష్‌బోర్డులో చూడవచ్చు. అలాగే వాటిని మేనేజ్ చేయవచ్చు. ఇప్పటికే ఉన్న పోర్ట్‌ఫోలియోలు ఆటోమేటిక్‌గా కనిపిస్తాయి. కొత్త పోర్ట్‌ఫోలియోలను స్క్రీన్‌షాట్లు, సీఎస్‌వీ లేదా పీడీఎఫ్ ఫైల్స్ ద్వారా లేదా నాచురల్ చాటింగ్ ద్వారా సమాచారం ఇచ్చి క్రియేట్ చేయవచ్చు. డ్యాష్ బోర్డులో పోర్ట్‌ఫోలియో పనితీరు వివరాలు, అసెట్ అలొకేషన్ విశ్లేషణ, యూజర్ పెట్టుబడులకు అనుగుణంగా ఇతర ఆర్థిక సమాచారాన్ని ఒకే చోట పొందవచ్చు. పోర్ట్‌ఫోలియో సిద్ధమైన తరువాత ఏఐ రీసెర్చ్ టూల్‌ను ఉపయోగించి ఏయే రంగాల్లో పెట్టుబడులు తక్కువగా ఉన్నాయో, స్థిర ఆదాయ పెట్టుబడులు దీర్ఘకాలిక వృద్ధిపై ఎలా ప్రభావం చూపిస్తాయో ఆయా వివరాలను ప్రశ్నల రూపంలో అడిగి పొందవచ్చు.
మార్కెట్ అప్‌డేట్లను పొందవచ్చు..
గూగుల్ ఫైనాన్స్ యూజర్లు ఎంచుకున్న అంశాలు, ఆసక్తుల ఆధారంగా వ్యక్తిగతీకరించిన మార్కెట్ అప్‌డేట్లను కూడా అందిస్తుంది. ఉదాహరణకు ప్రతి రోజు మార్కెట్ ప్రారంభానికి ముందు గత రాత్రి జరిగిన ప్రధాన క్రిప్టోకరెన్సీ కదలికలపై బ్రీఫింగ్ ఇవ్వాలని యూజర్లు టాస్క్‌లను సెట్ చేసుకోవచ్చు. ఈ టాస్క్‌లను షెడ్యూల్, సూచనలతో అప్‌డేట్ చేయవచ్చు. అలాగే వాచ్‌లిస్ట్‌లు లేదా పోర్ట్‌ఫోలియోలను ఆధారంగా తీసుకుని మరింత సంబంధిత సమాచారం అందేలా కూడా రూపొందించుకోవచ్చు. ఈ వ్యవస్థ బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ, యూజర్ నిర్ణయించిన సమయానికి మార్కెట్ అప్‌డేట్లను అందిస్తుంది. పూర్తయిన మార్కెట్ బ్రీఫింగ్‌లు ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లోని గూగుల్ యాప్ ద్వారా నోటిఫికేషన్‌ల రూపంలో అందుతాయి. అలాగే వెబ్ రీసెర్చ్ ప్యానెల్‌లో కూడా వీటిని చూడడంతోపాటు ఇప్పటికే ఉన్న టాస్క్‌లను సవరించే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది.
ప్రత్యేక యాప్ కూడా..
గూగుల్ ప్రత్యేకంగా గూగుల్ ఫైనాన్స్ ఆండ్రాయిడ్ యాప్ ను కూడా విడుదల చేసింది. దీంతో మొబైల్ యూజర్లు గూగుల్ ఫైనాన్స్ ప్రధాన ఫీచర్లను నేరుగా యాప్‌లో ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్‌లో వాచ్‌లిస్ట్‌లు, రియల్‌టైమ్ మార్కెట్ డేటా, లైవ్ ఫైనాన్షియల్ న్యూస్ ఫీడ్, ఏఐ రీసెర్చ్ టూల్, అలాగే స్టాక్ ధరల కదలికలకు కారణాలను వివరించే ఏఐ ఆధారిత కీ మొమెంట్స్ ఫీచర్ అందుబాటులో ఉన్నాయి. రాబోయే నెలల్లో లైవ్ ఎర్నింగ్స్ కాల్స్, పోర్ట్‌ఫోలియో టూల్స్, మార్కెట్ అప్‌డేట్ టాస్క్‌ల వంటి వెబ్ ఫీచర్లను కూడా ఆండ్రాయిడ్ యాప్‌లో చేర్చనున్నట్లు గూగుల్ వెల్లడించింది. బీటా దశ ముగిసిన అనంతరం కొత్త గూగుల్ ఫైనాన్స్ అప్ డేట్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. పోర్ట్‌ఫోలియో ట్రాకింగ్, ఏఐ ఆధారిత మార్కెట్ అప్‌డేట్లు ఇప్పటికే గ్లోబల్‌గా అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక ఆండ్రాయిడ్ యాప్ ఈ వారం నుంచి అందుబాటులోకి రానుండగా, ఐఓఎస్ వెర్షన్ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.
తాజావార్తలు
- ●Türkiye Vs USA | విజయంతో వీడ్కోలు..
- ●Devi Prasad | మూడేండ్లు బీటెక్ చదివితే స్థానికులు ఎట్లయితరు?
- ●YouTube Shorts | యూట్యూబ్ షార్ట్స్‌కు భారీ అప్‌డేట్.. రెట్టింపు వేగంతో వీడియోలను చూడవచ్చు..
- ●Ivory Coast vs Curacao | ఐవరీ కోస్ట్ హిస్టరీ
- ●Nabha Natesh | అప్పుడు హీరోయిన్.. ఇప్పుడు ఐటెంగర్ల్ - మాస్ మహారాజా సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ
- ●Operation Sindoor | 'ఆపరేషన్ సిందూర్'.. అమరులైన ఆరుగురు జవాన్లు వీరే

Türkiye Vs USA | విజయంతో వీడ్కోలు..

Devi Prasad | మూడేండ్లు బీటెక్ చదివితే స్థానికులు ఎట్లయితరు?

YouTube Shorts | యూట్యూబ్ షార్ట్స్‌కు భారీ అప్‌డేట్.. రెట్టింపు వేగంతో వీడియోలను చూడవచ్చు..

Ivory Coast vs Curacao | ఐవరీ కోస్ట్ హిస్టరీ



