Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.27వేలు తగ్గిన బంగారం ధర.. ఈక్విటీల వైపు ప్రజల మొగ్గు..
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం చోటు చేసుకుని ముడి చమురు సరఫరాకు ఉన్న అడ్డంకులు తొలగిపోతుండడంతో అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు ర్యాలీని కొనసాగిస్తున్నాయి. అయితే బులియన్ మార్కెట్లలో మాత్రం అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది.
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం చోటు చేసుకుని ముడి చమురు సరఫరాకు ఉన్న అడ్డంకులు తొలగిపోతుండడంతో అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు ర్యాలీని కొనసాగిస్తున్నాయి. అయితే బులియన్ మార్కెట్లలో మాత్రం అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది. యుద్ధ ఉద్రిక్తతలు తగ్గడంతో పెట్టుబడిదారులు సేఫ్ హావెన్ ఆస్తులు కాకుండా ఈక్విటీల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర గురువారం 0.19 శాతం తగ్గి 3,992 డాలర్లకు చేరగా, వెండి ధర 0.08 శాతం తగ్గి 57 డాలర్లకు వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 250 పాయింట్లు పెరిగి 1,41,520 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1423 పాయింట్లు పెరిగి 2,14,639 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,013 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,12, 114 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,40,130 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,01,300 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.27,800 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.12,845 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,02,760గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,28,450 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.12,84,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.25,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,510 ఉండగా, 8 గ్రాముల ధర రూ.84,080గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,05,100 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,51,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.20,800 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.10వేలు తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,30,000 ఉండగా, తులం ధర రూ.2,300 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారుల నిరాసక్తత..?
జూన్ 24, 2026

Gold And Silver Prices Today | భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
జూన్ 23, 2026

Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
జూన్ 22, 2026
తాజావార్తలు
- ●Revanth Reddy | 28న నల్లగొండ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- ●Motilal Oswal | టెక్స్టైల్ షేర్లపై మోతీలాల్ ఒస్వాల్ బుల్ సెంటిమెంట్.. ఈ 5 స్టాక్స్‌కు బై రేటింగ్..
- ●Rajya Sabha MPs | 31 శాతం మంది రాజ్యసభ ఎంపీలపై క్రిమినల్ కేసులు.. రూ..5,300 కోట్ల ఆస్తితో తెలంగాణ ఎంపీ టాప్
- ●SBI | ఎస్బీఐలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. స్థానిక భాష తెలిసినవారికి ప్రాధాన్యం
- ●Mexico vs Czechia | చెకియాపై మెక్సికో గ్రాండ్ విక్టరీ.. వరల్డ్ కప్‌లో సరికొత్త చరిత్ర, ఓచోవా అరుదైన రికార్డ్!
- ●ITR Refund | ఐటీఆర్ రీఫండ్ త్వరగా రావాలంటే ఇదే సీక్రెట్.. 7 రోజుల్లోనే డబ్బు ఖాతాలోకి..

Revanth Reddy | 28న నల్లగొండ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Motilal Oswal | టెక్స్టైల్ షేర్లపై మోతీలాల్ ఒస్వాల్ బుల్ సెంటిమెంట్.. ఈ 5 స్టాక్స్‌కు బై రేటింగ్..

Rajya Sabha MPs | 31 శాతం మంది రాజ్యసభ ఎంపీలపై క్రిమినల్ కేసులు.. రూ..5,300 కోట్ల ఆస్తితో తెలంగాణ ఎంపీ టాప్

SBI | ఎస్బీఐలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. స్థానిక భాష తెలిసినవారికి ప్రాధాన్యం



