త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Surya bhai Arrest | గోల్డ్‌మెన్ సూర్యాభాయ్ మోసం.. ఎఫ్ఐఆర్ న‌మోదు

Surya bhai Arrest | హైద‌రాబాద్‌ పాతబస్తీకి చెందిన‌ గోల్డ్‌మ్యాన్‌గా పేరొందిన పల్లపు సురేశ్‌కుమార్‌ అలియాస్‌ సూర్యాభాయ్ క‌ట‌క‌టాల‌పాల‌య్యాడు. ముఖ్య‌మంత్రి, హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌నర్‌కు తాను అత్యంత స‌న్నిహితుడిన‌ని మాయ‌మాట‌లు చెప్పి మోసం చేయ‌డంతో ఆయ‌నపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

S

Hyderabad | Published On Jun 26, 2026, 12.55 pm IST

Surya bhai Arrest | గోల్డ్‌మెన్ సూర్యాభాయ్ మోసం.. ఎఫ్ఐఆర్ న‌మోదు
Advertisement

Surya bhai Arrest | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌ పాతబస్తీకి చెందిన‌ గోల్డ్‌మ్యాన్‌గా పేరొందిన పల్లపు సురేశ్‌కుమార్‌ అలియాస్‌ సూర్యాభాయ్ క‌ట‌క‌టాల‌పాల‌య్యాడు. ముఖ్య‌మంత్రి, హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌నర్‌కు తాను అత్యంత స‌న్నిహితుడిన‌ని మాయ‌మాట‌లు చెప్పి మోసం చేయ‌డంతో ఆయ‌నపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. త‌క్కువ ధ‌ర‌కే బంగారు ఆభ‌ర‌ణాలు ఇప్పిస్తానంటూ రూ.30 లక్ష‌ల వ‌ర‌కు మోసం చేశార‌ని అత‌డి బాధితులు ఫిర్యాదు చేశారు.

అత్తాపూర్‌ పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. ఎంత‌కూ బంగారం ఇవ్వ‌క‌పోవ‌డంతో డ‌బ్బుల కోసం సూర్యాభాయ్‌ ఇంటివ‌ద్ద‌కు వెళ్లి నిల‌దీశారు. దీంతో చేసేది లేక 3 ఐఫోన్లు, రూ.20 ల‌క్ష‌ల చెక్కును బాధితుల‌కు సూర్యాభాయ్ అంద‌జేశారు. ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేని సూర్యాభాయ్ త‌ర్వాత బాధితుల‌ను బెదిరించి ఫోన్లు తీసుకెళ్లాడ‌ని ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి కేసును నారాయ‌ణగూడ పోలీస్ స్టేషన్‌కు బ‌దిలీ చేసిన‌ట్లు అత్తాపూర్ పోలీసులు తెలిపారు.

 

Advertisement
Advertisement