Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్ దేశాలు శాంతి ఒప్పందానికి వచ్చినా ఇంకా సంతకాలు జరగకపోవడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం సందిగ్ధంలో కొనసాగుతున్నాయి. అయితే బంగారం, వెండి లాంటి సేఫ్ హావెన్ ఆస్తుల్లో పెట్టబడులు పెట్టిన వారు లాభాల బుకింగ్ కోసం చూస్తున్నారు.
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్ దేశాలు శాంతి ఒప్పందానికి వచ్చినా ఇంకా సంతకాలు జరగకపోవడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం సందిగ్ధంలో కొనసాగుతున్నాయి. అయితే బంగారం, వెండి లాంటి సేఫ్ హావెన్ ఆస్తుల్లో పెట్టబడులు పెట్టిన వారు లాభాల బుకింగ్ కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో రెండు మూడు రోజుల నుంచి వచ్చిన ర్యాలీకి బ్రేక్ పడింది. బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లలో స్వల్పంగా తగ్గాయి. బంగారం ధర ఔన్స్‌కు 0.12 శాతం తగ్గి 4,325 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 0.03 శాతం తగ్గి 68 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 590 పాయింట్లు తగ్గి 1,52,501 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 910 పాయింట్లు పతనమై 2,49,195 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,110 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,20, 880 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,51,100 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,11,000 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.2,700 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,850 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,10,800గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,38,500 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,85,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,332 ఉండగా, 8 గ్రాముల ధర రూ.90,656గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,13,320 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,33,200గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,100 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,65,000 ఉండగా, తులం ధర రూ.2,650గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,75,000 ఉండగా, తులం ధర రూ.2,750 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. బంగారం కొనేందుకు మంచి చాన్స్..
ఆగస్టు 25, 2026

Gold And Silver Prices Today | పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. ఇన్వెస్టర్లకు ఇదే మంచి చాన్స్..?
ఆగస్టు 24, 2026

Murdered | హైదరాబాద్ మీర్పేట్లో దారుణం.. అర తులం బంగారం కోసం స్కూల్ ఆయా హత్య
ఆగస్టు 22, 2026
తాజావార్తలు
- ●Japan companies in Telangana | అందుకే తెలంగాణ యువతకు జపనీస్ భాష, స్కిల్స్ నేర్పిస్తున్నాం
- ●TTD | బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి సేవ చేయాలనుకుంటున్నారా..? అయితే మీకో గుడ్‌న్యూస్..!
- ●CS Jaju | ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎస్ సంజయ్ జాజు ఆదేశం..
- ●ఆపరేషన్ సిందూర్ వేళ సైబర్ దాడులు: రామగుండం సహా 5 ప్రాంతాల్లో NIA మెరుపు సోదాలు.. అసలు లింకేంటి?
- ●Urea price impact Telangana | రైతన్నలూ.. తక్కువ ధరకు దొరికే యూరియాను వాడకండి.. నేల ఆరోగ్యం దెబ్బతింటుంది
- ●Revanth Reddy | మూసీ భూసేకరణలో వేగం పెంచండి.. చిక్కులు రావొద్దు

Japan companies in Telangana | అందుకే తెలంగాణ యువతకు జపనీస్ భాష, స్కిల్స్ నేర్పిస్తున్నాం

TTD | బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి సేవ చేయాలనుకుంటున్నారా..? అయితే మీకో గుడ్‌న్యూస్..!

CS Jaju | ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎస్ సంజయ్ జాజు ఆదేశం..

ఆపరేషన్ సిందూర్ వేళ సైబర్ దాడులు: రామగుండం సహా 5 ప్రాంతాల్లో NIA మెరుపు సోదాలు.. అసలు లింకేంటి?



