త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | పెట్టుబ‌డిదారుల‌కు అల‌ర్ట్‌.. భారీగా ప‌త‌న‌మైన బంగారం, వెండి ధ‌ర‌లు..

Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు మ‌ళ్లీ పెరుగుతుండ‌డంతో అంత‌ర్జాతీ ఈక్విటీ మార్కెట్లు మ‌ళ్లీ ప‌త‌న‌మ‌వుతున్నాయి. ఆ ప్ర‌భావం బులియ‌న్ మార్కెట్ల‌పైనా ప‌డింది. బంగారం, వెండి ధ‌ర‌ల్లో ఇటీవ‌లి కాలంలో తీవ్ర హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటుండ‌గా, బుధ‌వారం నాటి సెష‌న్‌లో వాటి ధ‌ర‌లు మ‌ళ్లీ త‌గ్గాయి.

S

Business | Published On Jun 10, 2026, 11.23 am IST

Gold And Silver Prices Today | పెట్టుబ‌డిదారుల‌కు అల‌ర్ట్‌.. భారీగా ప‌త‌న‌మైన బంగారం, వెండి ధ‌ర‌లు..
Advertisement

Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు మ‌ళ్లీ పెరుగుతుండ‌డంతో అంత‌ర్జాతీ ఈక్విటీ మార్కెట్లు మ‌ళ్లీ ప‌త‌న‌మ‌వుతున్నాయి. ఆ ప్ర‌భావం బులియ‌న్ మార్కెట్ల‌పైనా ప‌డింది. బంగారం, వెండి ధ‌ర‌ల్లో ఇటీవ‌లి కాలంలో తీవ్ర హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటుండ‌గా, బుధ‌వారం నాటి సెష‌న్‌లో వాటి ధ‌ర‌లు మ‌ళ్లీ త‌గ్గాయి. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 1.47 శాతం త‌గ్గి 4,197 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, వెండి ధ‌ర 1.69 శాతం త‌గ్గి 64 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 2,165 పాయింట్లు ప‌డిపోయి 1,50,278 వ‌ద్ద ఉంది. సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 3,168 పాయింట్లు త‌గ్గి 2,35,360 వ‌ద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,886 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,19, 088 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,48,860 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,88,600 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.43వేలు త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,645 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,09,160గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,36,450 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,64,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.39,500 త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,164 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.89,312గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,11,640 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,16,400గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.32,300 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,50,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,500గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.10వేలు త‌గ్గింది. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,60,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,600 గా ఉంది.

Advertisement
Advertisement