Home Loan | హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఏమవుతుంది? కుటుంబంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
Home Loan | ఎవరికైనా సరే సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడంలో హోమ్ లోన్ కీలక పాత్ర పోషిస్తుంది. పెరుగుతున్న జీవన వ్యయం, ఆస్తుల ధరల నేపథ్యంలో చాలా కుటుంబాలకు ఆర్థిక సహాయం లేకుండా ఇల్లు కొనుగోలు చేయడం కష్టంగా మారింది.
Home Loan | ఎవరికైనా సరే సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడంలో హోమ్ లోన్ కీలక పాత్ర పోషిస్తుంది. పెరుగుతున్న జీవన వ్యయం, ఆస్తుల ధరల నేపథ్యంలో చాలా కుటుంబాలకు ఆర్థిక సహాయం లేకుండా ఇల్లు కొనుగోలు చేయడం కష్టంగా మారింది. హోమ్ లోన్ ద్వారా ఇంటి కొనుగోలుదారులు రుణ మొత్తాన్ని అనేక సంవత్సరాల పాటు వాయిదాల రూపంలో చెల్లించే అవకాశం పొందుతారు. అలాగే పన్ను రాయితీలు, పోటీ వడ్డీ రేట్ల వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అయితే హోమ్ లోన్‌కు సంబంధించిన కొన్ని కీలక అంశాలను కూడా తెలుసుకోవడం అవసరం. హోమ్ లోన్ సాధారణంగా చాలా సంవత్సరాల పాటు కొనసాగే పెద్ద ఆర్థిక బాధ్యత. రుణ కాలంలోనే రుణగ్రహీత మరణిస్తే, బ్యాంకు తన బకాయి మొత్తాన్ని ఎలా తిరిగి పొందాలి, ఆ రుణాన్ని ఎవరు చెల్లించాలి అనే అంశాలపై ముందే నిర్దిష్ట నిబంధనలు ఉంటాయి.
రుణగ్రహీత మరణిస్తే..
హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి రుణ కాలంలో మరణిస్తే, ముందుగా అతను హోమ్ లోన్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడా లేదా అనే విషయాన్ని రుణదాతలు పరిశీలిస్తారు. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ లేదా హోమ్ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్ అంటే ప్రత్యేకమైన జీవిత బీమా పాలసీ. రుణగ్రహీత అకాల మరణం సంభవిస్తే, పాలసీ నిబంధనలకు లోబడి మిగిలిన హోమ్ లోన్ బకాయిని బీమా సంస్థ చెల్లిస్తుంది. దీంతో కుటుంబ సభ్యులపై రుణ భారం తగ్గే అవకాశం ఉంటుంది. జాయింట్ హోమ్ లోన్ తీసుకున్నట్లయితే, సాధారణంగా మిగిలిన రుణాన్ని చెల్లించే బాధ్యత సహ-రుణగ్రహీతపై ఉంటుంది. ఒకవేళ సహ-రుణగ్రహీత కూడా రుణాన్ని చెల్లించలేకపోతే, బ్యాంకు గ్యారంటర్, చట్టబద్ధ వారసులు లేదా ఇతర కుటుంబ సభ్యులను సంప్రదించి రుణ చెల్లింపులను కొనసాగించాలని కోరుతుంది.
బ్యాంకులు ఏం చేస్తాయి..?
కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రుణాన్ని కొనసాగించేందుకు అంగీకరిస్తే, సాధారణంగా బ్యాంకు ఆ ఇంటిని వారి వద్దే కొనసాగేందుకు అనుమతిస్తుంది. అలాగే మానవతా దృక్పథంతో కొంత అదనపు గడువు ఇవ్వడం, రుణాన్ని పునర్వ్యవస్థీకరించడం లేదా తాత్కాలికంగా మారటోరియం కల్పించడం వంటి వెసులుబాట్లను కూడా కొన్ని సందర్భాల్లో బ్యాంకులు అందిస్తాయి. అయితే తగినంత సమయం ఇచ్చిన తర్వాత కూడా ఎవరూ రుణాన్ని చెల్లించలేని పరిస్థితి ఉంటే, బ్యాంకు లేదా రుణదాత మిగిలిన బకాయిని వసూలు చేసేందుకు ఆస్తిని స్వాధీనం చేసుకుని విక్రయించే హక్కును కలిగి ఉంటారు. హోమ్ లోన్ తీసుకోవడం సులభమే. కానీ అన్ని నిబంధనలను ముందుగానే తెలుసుకుని లోన్ తీసుకుంటే భవిష్యత్తులో వచ్చే ఎలాంటి ఇబ్బందినైనా సరే అధిగమించేందుకు అవకాశాలు ఉంటాయి.
సంబంధిత వార్తలు

Home Loan | స్థలం తండ్రి పేరిట ఉంటే పిల్లలు ఇల్లు కట్టుకోవచ్చా..? ఇంటి రుణం లభిస్తుందా..?
నవంబర్ 21, 2026

Home Loan | రూ.24 లక్షల జీతం.. 750 క్రెడిట్ స్కోర్.. అయినా హోమ్ లోన్ రిజెక్ట్.. కారణమేమిటి..?
అక్టోబర్ 31, 2026

Debt Repayment | అప్పులు తీర్చాలా? పెట్టుబడులు పెట్టాలా? ఏది ముందు చేయాలి..?
అక్టోబర్ 24, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



