Gold And Silver Prices Today | బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. ఒక్క రోజులోనే రూ.37వేలు పెరిగింది..
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం దిశగా చర్చలు మళ్లీ కొనసాగుతుండడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లకు పాజిటివ్ సంకేతాలు లభించాయి. దీంతో ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతుండగా అదే ప్రభావం బులియన్ మార్కెట్లపైనా పడింది.
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం దిశగా చర్చలు మళ్లీ కొనసాగుతుండడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లకు పాజిటివ్ సంకేతాలు లభించాయి. దీంతో ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతుండగా అదే ప్రభావం బులియన్ మార్కెట్లపైనా పడింది. గత కొద్ది రోజులుగా భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు గురువారం సెషన్‌లో భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 0.72 శాతం మేర పెరిగి 4,059 డాలర్ల వద్ద నిలవగా, వెండి ధర 1.24 శాతం మేర ఎగబాకి 59 డాలర్ల వద్ద నిలిచింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 486 పాయింట్లు తగ్గి 1,43,944 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 220 పాయింట్లు పెరిగి 2,30,604 వద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,455 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,15, 640 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,44,550 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,45,500 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.37,700 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,250 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,06,000గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,32,500 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,25,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.34,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,841 ఉండగా, 8 గ్రాముల ధర రూ.86,728గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,08,410 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,84,100గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.28,200 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.5వేలు పెరిగింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులు జాగ్రత్త అంటున్న నిపుణులు..
జులై 11, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
జులై 10, 2026

Gold | గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు.. అమ్మాలా, కొత్తగా కొనాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..
జులై 9, 2026
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం



