China | ఆ వాసన భరించలేకపోతున్నాం.. జిమ్‌లో ఓ వ్యక్తికి చేదు అనుభవం..!
China | బాడీ ఫిట్‌నెస్( Body Fitness ) కోసం చాలా మంది జిమ్( Gym )కు వెళ్తుంటారు. కనీసం రెండు గంటల పాటైనా జిమ్‌లోనే సమయాన్ని వెచ్చిస్తుంటారు. అలా జిమ్‌కు వెళ్లే ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. మీ నుంచి వచ్చే దుర్వాసనను భరించలేకపోతున్నాం.. జిమ్ నుంచి వెళ్లిపోవాలని సిబ్బంది చెప్పడంతో బాధిత వ్యక్తి షాక్‌కు గురయ్యాడు.
International | Published On Jul 4, 2026, 12.35 pm IST
China | త్రినేత్ర.న్యూస్ : బాడీ ఫిట్‌నెస్( Body Fitness ) కోసం చాలా మంది జిమ్( Gym )కు వెళ్తుంటారు. కనీసం రెండు గంటల పాటైనా జిమ్‌లోనే సమయాన్ని వెచ్చిస్తుంటారు. అలా జిమ్‌కు వెళ్లే ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. మీ నుంచి వచ్చే దుర్వాసనను భరించలేకపోతున్నాం.. జిమ్ నుంచి వెళ్లిపోవాలని సిబ్బంది చెప్పడంతో బాధిత వ్యక్తి షాక్‌కు గురయ్యాడు.
చైనాలోని హ్యాంగ్‌జుహు ప్రాంతానికి చెందిన షీ అనే వ్యక్తి తన బాడీ ఫిట్‌నెస్ కోసం.. స్థానికంగా ఉన్న జిమ్‌లో చేరాడు. మూడేండ్ల కాలానికి అంటే 2025 మే నెలలో దాదాపు రూ. 89,587 చెల్లించాడు. ఈ సభ్యత్వం కాలపరిమితి 2028 ఏప్రిల్ వరకు ఉంది. ఇక రెగ్యులర్‌గా షీ జిమ్‌కు వచ్చి వర్కవుట్ చేస్తున్నాడు. సీన్ కట్ చేస్తే..
ఊహించని షాక్
ఈ ఏడాది జూన్ నెలలో షీకి ఊహించని పరిణామం ఎదురైంది. మీ నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుంది.. ఇక నుంచి మీరు జిమ్‌కు రావాల్సిన అవసరం లేదు. మిగిలిన కాలపరిమితికి సంబంధించిన నగదును మళ్లీ చెల్లిస్తున్నామని జిమ్ సిబ్బంది అతనికి తెలిపారు. చేసేదేమీ లేక షీ అక్కడ్నుంచి శాశ్వతంగా వెళ్లిపోయారు.
ఆ ఒత్తిడి భరించలేకనే..
అయితే షీ పట్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి జిమ్‌కు వచ్చే మిగతా వారి ఒత్తిడి వల్లే అని తేలింది. ఎందుకంటే.. షీ నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుందని, ఆ సమయంలో మేం వర్కవుట్ చేయలేకపోతున్నామని జిమ్ సిబ్బందికి మిగతా వారు తెలిపారు. ఆ వాసన మమ్మల్ని అసౌకర్యానికి గురి చేస్తుందని వాపోయారు.
సంబంధిత వార్తలు

Russia Sanctions Bill | రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం.. ఇక భారత్‌పై 100% టారిఫ్స్..!
సెప్టెంబర్ 19, 2026

Russia sanctions bill | రష్యాపై ఆంక్షల బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం.. భారత్ ఏమన్నదంటే..?
సెప్టెంబర్ 17, 2026

US Tariffs | భారత్‌పై అమెరికా 100 శాతం టారీఫ్‌లు.. తుదిదశకు బిల్లు
సెప్టెంబర్ 16, 2026
తాజావార్తలు
- ●Antibiotics | పెయిన్కిల్లర్లు, యాంటీబయాటిక్స్ వాడుతున్నారా..? కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు..!
- ●Kayadu Lohar | ప్యారడైజ్ కోసం కయదు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే? - అందరికంటే హీరోయిన్‌కే తక్కువ!
- ●Wine Shops | వైన్ షాపులు, బార్లు బంద్.. ఎప్పుడంటే? ఎందుకంటే?
- ●Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది
- ●Auto Driver Monthly Income 75000 | ఆటోడ్రైవర్ నెల సంపాదన రూ.75 వేలు.. కూతురి చదువు కోసం భారీ ఖర్చు.. చివరకు మిగిలింది ఇదే..!
- ●National Awards | అట్టహాసంగా జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుక - పురస్కారాలు స్వీకరించిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే!

Antibiotics | పెయిన్కిల్లర్లు, యాంటీబయాటిక్స్ వాడుతున్నారా..? కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు..!

Kayadu Lohar | ప్యారడైజ్ కోసం కయదు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే? - అందరికంటే హీరోయిన్‌కే తక్కువ!

Wine Shops | వైన్ షాపులు, బార్లు బంద్.. ఎప్పుడంటే? ఎందుకంటే?

Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది



