Gold And Silver Prices Today | అమెరికా డాలర్ ఎఫెక్ట్.. రోజు రోజుకీ భారీగా పడిపోతున్న బంగారం ధరలు..
Gold And Silver Prices Today | అమెరికా డాలర్ విలువ రోజు రోజుకీ పెరుగుతుండడం, రానున్న రోజుల్లో ఫెడ్ వడ్డీ రేట్లను మరింతగా పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో బంగారం విలువ రోజు రోజుకీ తగ్గిపోతోంది. యుద్ధం ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు వస్తున్నాయి. కానీ బులియన్ మార్కెట్లు మాత్రం ఇంకా కోలుకోలేదు.
Gold And Silver Prices Today | అమెరికా డాలర్ విలువ రోజు రోజుకీ పెరుగుతుండడం, రానున్న రోజుల్లో ఫెడ్ వడ్డీ రేట్లను మరింతగా పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో బంగారం విలువ రోజు రోజుకీ తగ్గిపోతోంది. యుద్ధం ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు వస్తున్నాయి. కానీ బులియన్ మార్కెట్లు మాత్రం ఇంకా కోలుకోలేదు. దీంతో గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. బుధవారం సైతం ఆయా లోహాల ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర ఒక్క రోజే 0.83 శాతం తగ్గి 3,974 డాలర్ల వద్దకు చేరగా, వెండి ధర 1.61 శాతం మేర పతనమై 57 డాలర్లకు వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1,482 పాయింట్లు తగ్గి 1,41,048 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 4,536 పాయింట్లు పతనమై 2,24,027 వద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం ధరలు మిశ్రమంగా ఉన్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గగా, వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,078 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,12, 624 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,40,780 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,07,800 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.12,600 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.12,905 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,03,240గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,29,050 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.12,90,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.11,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,559 ఉండగా, 8 గ్రాముల ధర రూ.84,472గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,05,590 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,55,900గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.9,400 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,40,000 ఉండగా, తులం ధర రూ.2,400గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.5వేలు పెరిగింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450 గా ఉంది.
సంబంధిత వార్తలు

Murdered | హైదరాబాద్ మీర్పేట్లో దారుణం.. అర తులం బంగారం కోసం స్కూల్ ఆయా హత్య
ఆగస్టు 22, 2026

Gold And Silver Prices Today | యుద్ధం ఎఫెక్ట్.. బులియన్ మార్కెట్ల వైపు పెట్టుబడిదారుల చూపులు..
ఆగస్టు 22, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన పసిడి ధర.. బులియన్ మార్కెట్లలో ఉత్సాహం..
ఆగస్టు 21, 2026
తాజావార్తలు
- ●Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు
- ●Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
- ●Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!
- ●Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!
- ●Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?
- ●Nagarkurnool | వానలు పడడం లేదని.. మృతదేహాన్ని వెలికి తీశారు

Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు

Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్

Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!

Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!



