త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు.. పెట్టుబ‌డిదారుల‌కు అల‌ర్ట్‌..

Gold And Silver Prices Today | గ‌త వారం రోజులుగా అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు ర్యాలీల‌తో కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ ప‌శ్చిమ ఆసియాలో తాజాగా నెల‌కొన్న యుద్ధ ఆందోళ‌న‌ల‌తోపాటు పెరుగుతున్న ద్ర‌వ్యోల్బ‌ణం కార‌ణంగా పెట్టుబ‌డిదారులు రిస్క్ తీసుకునే ధోర‌ణిని త‌గ్గించిన‌ట్లు స్ప‌ష్టమ‌వుతోంది. లాభాల స్వీక‌ర‌ణ‌కు మొగ్గు చూప‌డంతో ర్యాలీల‌కు బ్రేక్ ప‌డింది.

S

Business | Published On Jul 31, 2026, 11.03 am IST

Gold And Silver Prices Today | స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు.. పెట్టుబ‌డిదారుల‌కు అల‌ర్ట్‌..
Advertisement

Gold And Silver Prices Today | గ‌త వారం రోజులుగా అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు ర్యాలీల‌తో కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ ప‌శ్చిమ ఆసియాలో తాజాగా నెల‌కొన్న యుద్ధ ఆందోళ‌న‌ల‌తోపాటు పెరుగుతున్న ద్ర‌వ్యోల్బ‌ణం కార‌ణంగా పెట్టుబ‌డిదారులు రిస్క్ తీసుకునే ధోర‌ణిని త‌గ్గించిన‌ట్లు స్ప‌ష్టమ‌వుతోంది. లాభాల స్వీక‌ర‌ణ‌కు మొగ్గు చూప‌డంతో ర్యాలీల‌కు బ్రేక్ ప‌డింది. దీంతో బంగారం, వెండి ధ‌ర‌లు కూడా స్వ‌ల్ప అస్థిర‌త‌ల‌తో కొన‌సాగుతున్నాయి. దేశీయ, అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో ఆయా లోహ‌ల ధ‌ర‌ల్లో తీవ్ర హెచ్చు త‌గ్గులు చోటు చేసుకుంటూ మిశ్ర‌మ ధోర‌ణి క‌నిపిస్తోంది. అందువ‌ల్ల కొత్త‌గా పెట్టుబ‌డి పెట్టేవారు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర శుక్ర‌వారం 0.51 శాతం మేర త‌గ్గి 4,082 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 0.62 శాతం త‌గ్గి 58 డాల‌ర్ల‌కు దిగి వ‌చ్చింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 868 పాయింట్లు పెరిగి 1,44,074 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 448 పాయింట్లు త‌గ్గి 2,19,519 వ‌ద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెర‌గ్గా, వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,460 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,15, 680గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,44,600 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,46,000 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.2,700 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,255 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,06,040గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,32,550 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,25,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2500 పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.10,845 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.86,760గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,08,450 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.10,84,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2వేలు పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,35,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,350గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌రలో ఎలాంటి మార్పు లేదు. హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,35,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,350 గా ఉంది.

Advertisement
Advertisement