త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.7,600 పెరిగిన బంగారం ధ‌ర‌.. పెట్టుబ‌డుల‌కు స‌మ‌యం వ‌చ్చిందా..?

Gold And Silver Prices Today | అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌లో గ‌త రెండు మూడు రోజులుగా భారీ అమ్మ‌కాల ఒత్తిడి ఏర్ప‌డ‌డంతో పెట్టుబ‌డిదారులు మ‌ళ్లీ బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తుల వైపు ప‌రుగులు పెడుతున్నారు. అందులో భాగంగానే గ‌త కొద్ది రోజులుగా క్షీణిస్తూ వ‌స్తున్న ఆయా లోహాల ధ‌ర‌లు మ‌ళ్లీ పెరుగుతున్నాయి.

S

Business | Published On Jul 18, 2026, 10.55 am IST

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.7,600 పెరిగిన బంగారం ధ‌ర‌.. పెట్టుబ‌డుల‌కు స‌మ‌యం వ‌చ్చిందా..?
Advertisement

Gold And Silver Prices Today | అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌లో గ‌త రెండు మూడు రోజులుగా భారీ అమ్మ‌కాల ఒత్తిడి ఏర్ప‌డ‌డంతో పెట్టుబ‌డిదారులు మ‌ళ్లీ బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తుల వైపు ప‌రుగులు పెడుతున్నారు. అందులో భాగంగానే గ‌త కొద్ది రోజులుగా క్షీణిస్తూ వ‌స్తున్న ఆయా లోహాల ధ‌ర‌లు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్‌ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర 1.02 శాతం మేర ఎగ‌సి 4,017 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 0.69 శాతం మేర పెరిగి 55 డాల‌ర్ల‌కు చేరింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 558 పాయింట్లు పెరిగి 1,40,906 వ‌ద్ద ముగియ‌గా, సిల్వర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 390 పాయింట్లు లాభ‌ప‌డి 2,16,403 వ‌ద్ద స్థిర‌ప‌డింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు భారీగా పెర‌గ్గా, వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,329 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,14, 632గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,43,290 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,32,900 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.7,600 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,135 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,05,080గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,31,350 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,13,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.7వేలు పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.10,747 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.85,976గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,07,470 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.10,74,700గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.5,700 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,30,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,300గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌రలో ఎలాంటి మార్పు లేదు. హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,35,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,350 గా ఉంది.

Advertisement
Advertisement