త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | మ‌ళ్లీ ప‌రుగులు పెడుతున్న ప‌సిడి ధ‌ర‌లు.. పెట్టుబ‌డిదారుల ఉత్సాహం..

Gold And Silver Prices Today | అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌లో తీవ్ర అనిశ్చితి నెల‌కొన్న‌ప్ప‌టికీ బులియ‌న్ మార్కెట్ల‌లో మాత్రం పెట్టుబ‌డిదారుల కొనుగోళ్ల ఉత్సాహం క‌నిపిస్తోంది. దీంతో గ‌త కొద్ది రోజులుగా మ‌ళ్లీ ఆయా లోహాల ధ‌ర‌ల‌కు రెక్క‌లు వ‌చ్చాయి. మ‌ళ్లీ ఆల్ టైం హై దిశ‌గా ప‌రుగులు పెడుతున్నాయి.

S

Business | Published On Aug 8, 2026, 10.56 am IST

Gold And Silver Prices Today | మ‌ళ్లీ ప‌రుగులు పెడుతున్న ప‌సిడి ధ‌ర‌లు.. పెట్టుబ‌డిదారుల ఉత్సాహం..
Advertisement

Gold And Silver Prices Today | అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌లో తీవ్ర అనిశ్చితి నెల‌కొన్న‌ప్ప‌టికీ బులియ‌న్ మార్కెట్ల‌లో మాత్రం పెట్టుబ‌డిదారుల కొనుగోళ్ల ఉత్సాహం క‌నిపిస్తోంది. దీంతో గ‌త కొద్ది రోజులుగా మ‌ళ్లీ ఆయా లోహాల ధ‌ర‌ల‌కు రెక్క‌లు వ‌చ్చాయి. మ‌ళ్లీ ఆల్ టైం హై దిశ‌గా ప‌రుగులు పెడుతున్నాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర ఒక్క రోజే 101 డాల‌ర్లు (2.39 శాతం) పెరిగి 4,341 డాలర్ల‌కు ఎగ‌బాకింది. వెండి ధ‌ర 3.29 శాతం మేర పెరిగి 63 డాల‌ర్ల‌కు చేరింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు ఏకంగా 2962 పాయింట్లు పెరిగి క్రితం రాత్రి ముగిసిన సెష‌న్‌లో 1,51,820 వ‌ద్ద స్థిర‌ప‌డింది. సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 5,630 పాయింట్లు ఎగ‌సి 2,31,466 వ‌ద్ద ముగిసింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం ధ‌ర‌లు భారీగా పెరిగాయి. వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,235 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,21, 880గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,52,350 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,23,500 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.10,900 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,965 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,11,720గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,39,650 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,96,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.10వేలు పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,426 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.91,408గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,14,260 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,42,600గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.8,200 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,45,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,450గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌రలో ఎలాంటి మార్పు లేదు. హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,49,900 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,499 గా ఉంది.

Advertisement
Advertisement