Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. తగ్గిన బంగారం ధరలు..
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా దేశీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ ఇంకా ఎక్కువ స్థాయిలోనే కొనసాగుతుండడంతో పెట్టుబడిదారుల్లో చమురు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన నెలకొంది. దీంతో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా దేశీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ ఇంకా ఎక్కువ స్థాయిలోనే కొనసాగుతుండడంతో పెట్టుబడిదారుల్లో చమురు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన నెలకొంది. దీంతో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. రిస్క్ తీసుకునే ధోరణిని తగ్గిస్తుండడంతోపాటు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. అయితే సేఫ్ హావెన్ ఆస్తులుగా ఉన్న బంగారం, వెండి ధరలు మాత్రం మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లలో గురువారం వీటి ధరలు స్వల్పంగా పెరగ్గా, దేశీయ కమోడిటీ మార్కెట్లలో మాత్రం స్వల్పంగా తగ్గాయి. దీంతో బులియన్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్‌లలో ఔన్స్ బంగారం ధర ఈ సెషన్‌లో 0.57 శాతం పెరిగి 4,619 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 1.37 శాతం మేర ఎగబాకి 69 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 313 పాయింట్లు తగ్గి, 1,59,281 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 362 పాయింట్లు పెరిగి 2,40,000 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.16,298 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,30, 384 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,62,980 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.16,29,800 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.7,700 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,940 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,19,520గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,49,400 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,94,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.7,000 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.12,224 ఉండగా, 8 గ్రాముల ధర రూ.97,792గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,22,240 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.12,22,400గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.5,700 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,60,000 ఉండగా, తులం ధర రూ.2,600గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,65,000 ఉండగా, తులం ధర రూ.2,650 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోష్.. లాభాల స్వీకరణకు దిగిన పెట్టుబడిదారులు..
ఆగస్టు 26, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. బంగారం కొనేందుకు మంచి చాన్స్..
ఆగస్టు 25, 2026

Gold And Silver Prices Today | పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. ఇన్వెస్టర్లకు ఇదే మంచి చాన్స్..?
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●Nepal Flash Floods | నేపాల్ జల ప్రళయం.. 300 మంది భారతీయులు గల్లంతు.. పొంచి ఉన్న మరో ముప్పు
- ●Bill Gates | కొన్ని రకాల ఉద్యోగాలను ఏఐకి ఇవ్వొద్దు.. బిల్ గేట్స్ హెచ్చరిక..
- ●RS Praveen Kumar | రేవంత్ రెడ్డి, బండి సంజయ్.. ఆంధ్ర న్యూస్ చానళ్లకు ప్రధాన రక్షణ కవచాలు!: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●Revanth Reddy | మీరాలం చెరువు అభివృద్ధి పనులను అకస్మికంగా పరిశీలించిన సీఎం రేవంత్
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప లాభాలు.. చమురు ధరలే కీలకం..
- ●Harish Rao | హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వరంగల్ వెళ్లకుండా అడ్డుకున్న ప్రభుత్వం

Nepal Flash Floods | నేపాల్ జల ప్రళయం.. 300 మంది భారతీయులు గల్లంతు.. పొంచి ఉన్న మరో ముప్పు

Bill Gates | కొన్ని రకాల ఉద్యోగాలను ఏఐకి ఇవ్వొద్దు.. బిల్ గేట్స్ హెచ్చరిక..

RS Praveen Kumar | రేవంత్ రెడ్డి, బండి సంజయ్.. ఆంధ్ర న్యూస్ చానళ్లకు ప్రధాన రక్షణ కవచాలు!: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Revanth Reddy | మీరాలం చెరువు అభివృద్ధి పనులను అకస్మికంగా పరిశీలించిన సీఎం రేవంత్



